Husbands Being Beaten: భార్యల చేతుల్లో చావుదెబ్బలు తింటున్న భర్తలు తెలంగాణలోనే ఎక్కువట!

  • వెల్లడించిన రీసెర్చ్ సంస్థ బయో సోషల్ స్టడీస్ 
  • అధ్యయనాన్ని ప్రచురించిన కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రెస్
  • చావుదెబ్బలు తింటున్న వారిలో తాగుబోతులు, నిరక్షరాస్యులే ఎక్కువ
  • భారత్‌లో పురుషులకు రక్షణ చట్టాలు లేకపోవడమే కారణమన్న అధ్యయనం
Telangana is in first palce Husbands who are being beaten by the hands of their wives

మీరు చదివింది నిజమే! భార్యల చేతుల్లో చావుదెబ్బలు తింటున్న భర్తల సంఖ్య తెలంగాణలోనే ఎక్కువట. బయో సోషల్ స్టడీస్‌లో అనే రీసెర్చ్ సంస్థ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. తన్నులు తింటున్న వారిలో తాగుబోతులు, నిరక్షరాస్యుల సంఖ్యే ఎక్కువట. దేశంలో భర్తలపై జరుగుతున్న గృహహింసపై ఈ సంస్థ చేసిన అధ్యయనాన్ని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించింది.

గత 15 ఏళ్లలో భర్తలపై దాడులు ఐదింతలు పెరిగినట్టు అధ్యయనం పేర్కొంది. ప్రతి 1000 మంది మహిళల్లో 36 మంది భర్తలపై చేయిచేసుకుంటున్నారట. 2006లో మాత్రం ఈ సంఖ్య ఏడు మాత్రమే కావడం గమనార్హం. మనదేశంలో మహిళలకు మాత్రమే రక్షణ చట్టాలు ఉండడం కూడా పురుషులపై గృహహింస పెరగడానికి ఒక కారణమని అధ్యయనం పేర్కొంది. మద్యానికి బానిసైన భార్యలను వేధించడమే భర్తలపై దాడులకు ప్రధాన కారణమని అధ్యయనం వివరించింది.

More Telugu News