Ranchi Test: రాంచీ టెస్టులో ఇంగ్లండ్ పట్టుకోల్పోయిన వేళ మాజీ దిగ్గజం మైఖేల్ వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • ఇంగ్లండ్ టీమ్ వైఫల్యానికి డీఆర్ఎస్ విధానం కారణం కాదన్న క్రికెట్ దిగ్గజం
  • ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ ప్లేయర్లు డీఆర్ఎస్ గురించి కాస్త ఎక్కువ మాట్లాడుతున్నారని విమర్శలు
  • టెస్టులో రోజులు గడిచేకొద్దీ పట్టు కోల్పోతున్నారని విమర్శ 
  • ఇంగ్లండ్ క్రికెటర్లు దీనిపై ఆలోచన చేయాలని సూచన
Former legend Michael Vaughn made interesting comments on England as team in troble in the Ranchi Test

భారత్ సిరీస్‌‌లో పేలవ ప్రదర్శనకు, మరీ ముఖ్యంగా రాజ్‌కోట్ టెస్టులో ఘోర ఓటమికి డీఆర్ఎస్ విధానం కూడా ఒక కారణమంటూ ఇంగ్లండ్ క్రికెటర్లు చెబుతుండడాన్ని ఆ దేశ మాజీ క్రికెట్ దిగ్గజం మైఖేల్ వాన్ తప్పుబట్టారు. డీఆర్ఎస్ విధానం గురించి ఇంగ్లిష్ క్రికెటర్లు కాస్త ఎక్కువగా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తోందని విమర్శించాడు. రాజ్‌కోట్ టెస్టులో దారుణమైన ఓటమి, ప్రస్తుతం రాంచీ టెస్టుపై కూడా పర్యాటక జట్టు పట్టు కోల్పోయిన నేపథ్యంలో వాన్ ఈ విధంగా స్పందించాడు. ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 1-2 తేడాతో వెనుకబడడానికి డీఆర్ఎస్ విధానం కారణం కాదని అన్నాడు. ఇంగ్లండ్ జట్టు చక్కటి ఆరంభాలను అందుకుంటున్నప్పటికీ ఆధిపత్యాన్ని చేజార్చుకుంటోందని విశ్లేషించాడు. రాజ్‌కోట్, రాంచీ టెస్టులను చూస్తే ఈ పరిస్థితి స్పష్టమవుతోందని మైఖేల్ వాన్ ప్రస్తావించాడు.

‘‘ప్రస్తుత టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ టీమ్ డీఆర్ఎస్ విధానం గురించి కాస్త ఎక్కువగా మాట్లాడుతోందని నేను భావిస్తున్నాను. నిజమే కొన్ని నిర్ణయాలు తప్పుగా అనిపించాయి. స్క్రీన్‌పై పరిశీలించి చూస్తే ఈ విషయం అర్థమైంది. అయితే ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ వెనుకబడడానికి డీఆర్ఎస్ విధానం కారణం కాదు. రోజులు గడుస్తున్న కొద్దీ ఇంగ్లండ్ జట్టు మ్యాచ్‌పై పట్టును కోల్పోతోంది. అలా ఎందుకు జరుగుతుందనే దానిపై జట్టు ఆలోచించుకోవాలి" అన్నాడు.

కాగా రాంచీ టెస్టుపై భారత్ పట్టుబిగించిన విషయం తెలిసింది. ఇంగ్లండ్‌ను సెకండ్ ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోరుకే ఆలౌట్ చేయడంతో భారత విజయం లక్ష్యం 192 పరుగులుగా ఉంది. మూడవ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 40/0 పరుగులు చేసింది. దీంతో నాలుగవ రోజున 152 పరుగులు చేస్తే మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంటుంది. సిరీస్‌ను 3-1 తేడాతో దక్కించుకుంటుంది.

More Telugu News