TSPSC: టీఎస్ పీఎస్ సీ గ్రూప్ 1 సిలబస్ ఇదిగో!

  • ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల సిలబస్ పై క్లారిటీ
  • తాజాగా నోటిఫికేషన్ జారీ చేసిన టీఎస్ పీఎస్ సీ
  • రెండు దశల రాతపరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక
TSPSC Group 1 Syllabus Details

తెలంగాణలో గ్రూప్ 1 పోస్టులకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 563 పోస్టులను భర్తీ చేయనున్నట్లు కమిషన్ పేర్కొంది. ప్రిలిమ్స్, మెయిన్స్.. రెండు దశల రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఈ క్రమంలో ప్రిలిమ్స్, మెయిన్స్ కు సిలబస్ విషయంలో టీఎస్ పీఎస్ సీ తాజాగా క్లారిటీ ఇచ్చింది. 

పూర్తి ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే ప్రిలిమ్స్ లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీపై 150 మార్కులకు 150 ప్రశ్నలు.. ఈ పరీక్షకు కాలవ్యవధి 2:30 గంటలు. ఇందులో అర్హత సాధించిన వారికి మెయిన్స్ నిర్వహిస్తారు. మెయిన్స్ లో మొత్తం 900 మార్కులకు ఆరు పేపర్లతో వివరణాత్మక పరీక్ష నిర్వహిస్తారు. ఆరు పేపర్లతో పాటు క్వాలిఫైయింగ్ పేపర్ గా 150 మార్కులకు జనరల్ ఇంగ్లిష్ పేపర్ కూడా ఉంటుంది. ఈ పరీక్షకు 3 గంటల సమయం ఉంటుంది. 

ప్రిలిమ్స్ సిలబస్ ఇదే..
ఇంటర్నేషనల్ రిలేషన్స్
జనరల్ సైన్స్
ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్
ఇండియన్ ఎకానమీ
ఇండియన్, వరల్డ్ జియోగ్రఫీ
ఇండియన్ హిస్టరీ
ఇండియన్ కాన్‌స్టిట్యూషన్
గవర్నెన్స్, తెలంగాణ స్టేట్ పాలసీస్
తెలంగాణ లిటరేచర్, ఆర్ట్స్
రీజనింగ్ అనలిటికల్ ఎబిలిటీ
డేటా ఇంటర్ ప్రిటేషన్

మెయిన్స్..
పేపర్-1లో జనరల్ ఎస్సే 
పేపర్-II: హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ
పేపర్ – III – ఇండియన్ సొసైటీ, భారత రాజ్యాంగం, పరిపాలన వ్యవహారాలు
పేపర్ -IV – భారతదేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి
పేపర్- V – సైన్స్ & టెక్నాలజీ మరియు డేటా ఇంటర్‌ప్రిటేషన్
పేపర్-VI – తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు
జనరల్ ఇంగ్లీష్ (క్వాలిఫైయింగ్)

More Telugu News