Kuldeep Yadav: కుల్దీప్ యాదవ్ బ్యాటింగ్ స్టైల్‌ను అనుకరించిన రోహిత్‌శర్మ, శుభమన్‌గిల్.. వైరల్ వీడియో ఇదిగో!

Rohit Sharma and Shubman Gill hilariously imitate Kuldeep Yadavs batting stance
  • రాంచీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విలువైన 28 పరుగులు చేసిన కుల్దీప్ యాదవ్
  • వికెట్ల వేటకు అడ్డుకట్ట వేస్తూ క్రీజులో పాతుకుపోయిన వైనం
  • వికెట్ కోల్పోకుండా స్టైల్ మార్చి ఆడిన కుల్దీప్

రాజ్‌కోట్ టెస్టులో 27 పరుగులు చేసి పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్న టీమిండియా లెఫ్టార్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రాంచీ టెస్టులోనూ ఆకట్టుకున్నాడు. రజత్ పటీదార్ (17), రవీంద్ర జడేజా (12), సర్ఫరాజ్ ఖాన్ (14) వంటివారు విఫలమైన చోట 28 పరుగులు చేశాడు. చేసింది తక్కువ పరుగులే అయినా వికెట్ల పతనానికి అడ్డకట్ట వేసి విలువైన భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఏడు వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్నవేళ జట్టుకు ఆపద్బాంధవుడిలా నిలిచాడు. నిన్న ఆట ముగిసే సమయానికి మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్త పడ్డాడు. 72 బంతులు ఆడి 17 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఈ ఉదయం మరో 11 పరుగులు జోడించి అవుటయ్యాడు.

మామూలుగా కొద్దిగా వంగి బ్యాటింగ్ చేసే కుల్దీప్ ఇంగ్లండ్ బౌలర్లకు దొరక్కుండా కొద్దిగా స్టైల్ మార్చి ఆడాడు. ఇది కామెంటేటర్లతోపాటు డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న టీమిండియా సారథి రోహిత్, శుభమన్ గిల్ కంట పడింది. అంతే, వెంటనే అతడి బ్యాటింగ్ స్టైల్‌ను అనుకరిస్తూ పోజిచ్చారు. ఇది కాస్తా కెమెరాల దృష్టిలో పడడంతో వైరల్ అయింది.

  • Loading...

More Telugu News