క్లాసికల్ డ్యాన్స్ వీడియోతో ప్రయాణికులకు సేఫ్టీ సూచనలు.. వీడియో ఇదిగో!
- ఎయిర్ ఇండియా వినూత్న ఆలోచన
- నృత్య రూపంలో భద్రతా సూచనల ప్రదర్శన
- నెటిజన్లను ఆకట్టుకుంటున్న వీడియో
మన దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రఖ్యాత నృత్య రీతులను మేళవించి ఫ్లైట్ సేఫ్టీ సూచనలతో వీడియో రూపొందించింది. విమానం ఎక్కినప్పటి నుంచి గమ్యం చేరాక కిందకు దిగేంత వరకు ఎలా నడుచుకోవాలో ఇందులో సూచించింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో వైరల్ గా మారింది. త్వరలోనే ఈ వీడియోను తమ విమానాల్లో ప్రయాణికుల కోసం ప్రదర్శిస్తామని ఎయిర్ ఇండియా పేర్కొంది. డైరెక్టర్ భరత్ బాల, సింగర్ శంకర్ మహదేవన్, మెక్ కాన్ వరల్డ్ గ్రూప్ కు చెందిన ప్రసూన్ జోషిలతో ఈ వీడియోను రూపొందించినట్లు తెలిపింది.