Heart Attack: భారీ శబ్దంతో పాటలు.. గుండెపోటుతో 50 ఏళ్ల వ్యక్తి మృతి

  • ఒడిశాలోని రూర్కేలా నగరంలో ఘటన
  • సరస్వతీమాత నిమజ్జనం సందర్భంగా పెద్ద శబ్దంతో డీజే పాటలు
  • భారీ శబ్దం కారణంగా టీస్టాల్ నిర్వాహకుడికి గుండెపోటు
  • ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యుల ప్రకటన
Odisha man dies of heart attack due to loud music DJ detained

ఊరేగింపు సందర్భంగా పెద్ద శబ్దంతో పాటలు పెట్టడంతో ఓ మధ్యవయస్కుడు గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఒడిశాలో తాజాగా వెలుగులోకి వచ్చింది. రూర్కెలా నగరంలో ఈ ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, సరస్వతీ మాత విగ్రహం నిమజ్జనం కోసం ఇటీవల ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్వాహకులు డీజే బృందాన్ని పిలిచారు. అయితే, ఊరేగింపులో డీజే పెద్ద శబ్దంతో పాటలు పెట్టాడు. 

ఈ క్రమంలో అక్కడే ఓ టీస్టాల్ నిర్వహిస్తున్న ప్రేమ్‌నాథ్ బారాభాయ్‌కు గుండెపోటు వచ్చింది. ఒక్కసారిగా కుప్పకూలిపోయిన అతడిని రూర్కెలా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. దీంతో, స్థానికులు రఘునాథ్‌పలీ పోలీస్ స్టేషన్‌లో ఎదుట ధర్నాకు దిగారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. డీజేను అరెస్టు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News