మాఘ పూర్ణిమ వేళ గంగానదిలో స్నానానికి వెళ్తుండగా ప్రమాదం.. చెరువులోకి ట్రాక్టర్ దూసుకెళ్లి 15 మంది మృతి
- ఉత్తర ప్రదేశ్లోని కాస్గంజ్లో ఘటన
- మృతుల్లో 8 మంది చిన్నారులు
- ప్రమాదంపై యూపీ సీఎం యోగి తీవ్ర దిగ్భ్రాంతి
- మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున పరిహారం
మాఘ పూర్ణిమను పురస్కరించుకొని గంగానదిలో స్నానమాచరించేందుకు వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ప్రమాదంపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.