Balakrishna: షూటింగులకు బ్రేక్ ఇవ్వనున్న బాలకృష్ణ

  • ఎన్నికలకు దగ్గర పడుతున్న సమయం
  • ఎన్నికల ప్రచారంపై ఫుల్ ఫోకస్ చేయనున్న బాలయ్య
  • ఎన్నికల తర్వాత మళ్లీ షూటింగులకు హాజరుకానున్న బాలయ్య
Balakrishna to take a break from shootings

సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సినిమాలకు విరామం ఇవ్వబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. దర్శకుడు బాబి తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ షెడ్యూల్ ఈ నెలాఖరుకు పూర్తవుతుంది. ఆ తర్వాత ఆయన షూటింగ్ లకు ఫుల్ స్టాప్ పెట్టనున్నారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో... ఎన్నికల ప్రచారంపై బాలయ్య పూర్తి స్థాయిలో దృష్టి సారించనున్నారు. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు రాజకీయాలపైనే ఆయన ఫోకస్ చేయనున్నారు. టీడీపీ - జనసేన కూటమి గెలుపు కోసం ఆయన తన వంతు ప్రయత్నం చేయనున్నారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆయన మళ్లీ షూటింగుల్లో పాల్గొంటారు. మరోవైపు, కాసేపట్లో టీడీపీ - జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల కాబోతోంది. ఈ జాబితాలో హిందూపురం నియోజకవర్గం నుంచి బాలయ్య పేరును ప్రకటించే అవకాశం ఉంది.

More Telugu News