Dastagiri: కడప జైలు నుంచి దస్తగిరి విడుదల

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి అట్రాసిటీ, దాడి కేసుల్లో అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ రెండు కేసుల్లో దస్తగిరికి ఇటీవల బెయిల్ లభించింది. ఈ నేపథ్యంలో, దస్తగిరి నేడు కడప జైలు నుంచి విడుదలయ్యాడు. 

ఓ ప్రేమ జంట వ్యవహారంలో దస్తగిరిపై అట్రాసిటీ, దాడి కేసులు నమోదు కాగా, గత 4 నెలలుగా దస్తగిరి కడప జైల్లో రిమాండ్  ఖైదీగా ఉన్నాడు. బెయిల్ ఉత్తర్వుల నేపథ్యంలో, జైలు నుంచి పోలీసు బందోబస్తు మధ్య దస్తగిరి పులివెందుల వెళ్లాడు. అంతకుముందు, తన విడుదలపై జైలు గెస్ట్ హౌస్ లో ఉన్న సీబీఐ అధికారులకు సమాచారం అందించాడు.
Dastagiri
Bail
Kadapa Jail
YS Vivekananda Reddy

More Telugu News