Yogi Meditation: మంచు ముంచేస్తున్నా చలించకుండా ధ్యానం.. వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?

  • మంచు తనను కమ్మేస్తున్నా ధ్యానంలో నిమగ్నమైన యోగి
  • వైరల్ అయిన ఈ వీడియో ఏఐ సృష్టిగా కొట్టిపడేసిన నెటిజన్లు
  • ఫేక్ కాదని తేలిన వైనం
  • ఆ యోగిని హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లాకు చెందిన సత్యేంద్రనాథ్‌గా గుర్తింపు
  • 22 ఏళ్లగా యోగాభ్యాసం
  • వీడియోను షూట్ చేసిన ఇష్పుత్ర శిష్యుడు రాహుల్
Truth behind viral video of Yogi meditating in snowclad mountains

మంచు దట్టంగా కురుస్తూ తనను కమ్మేస్తున్నా సరే ఏమాత్రం చలించక ధ్యానం చేస్తున్న ఓ యోగి వీడియో సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. హిమాచల్ ప్రదేశ్‌లోని మంచుతో కప్పుకుపోయిన పర్వతాలపై కనిపించిన ఈ దృశ్యం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. అదంతా ఏఐ సృష్టేనని కొట్టిపడేశారు. అయితే, అది ఫేక్ కాదని తాజాగా నిర్ధారణ అయింది. ఆ యోగిని హిమాచల్ ప్రదేశ్ కులు జిల్లాలకు చెందిన సత్యేంద్రనాథ్‌గా గుర్తించారు. 

బంజర్‌కు చెందిన సత్యేంద్రనాథ్ కౌలంటక్ పీఠం ఆశ్రమంలో 22 ఏళ్లుగా యోగా అభ్యసిస్తున్నారు. ఆయన అనుచరులను ఇష్పుత్ర అని పిలుస్తారు. సత్యేంద్రనాథ్ గురువు ఇష్‌నాథ్ హిమాలయ యోగా సంప్రదాయాన్ని అనుసరించేవారు. ఆయన కౌలాంటక్ పీఠానికి అధిపతి. ఈ పీఠం యోగా, దైవిక అభ్యాసాలకు స్థానం. ఇష్పుత్ర భక్తులు ఎనిమిదికి పైగా దేశాలలో విస్తరించి యోగా, భక్తి అభ్యసాలను ప్రోత్సహిస్తూ ఉంటారు.  

సత్యేంద్రనాథ్ గడ్డకట్టిన మంచులో యోగా చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చాలామందిని ఆకర్షించింది. ఇష్పుత్రలో చిన్నప్పటి నుంచే యోగాభ్యాసం మొదలవుతుంది. హిమపాతం మధ్య యోగాను అభ్యసించడానికి కఠిన శిక్షణ అవసరం. సవాలు చేసే వాతావరణ పరిస్థితుల్లో ఇష్పుత్ర ధ్యానానికి సంబంధించిన ప్రత్యేకమైన రూపాన్ని ప్రదర్శిస్తుంది. కాగా, వైరల్ అవుతున్న వీడియోను ఈ నెల మొదట్లో ఇష్పుత్ర శిష్యుడు రాహుల్ షూట్ చేశారు. భవిష్యత్ తరాలకు అవగాహన కల్పించేందుకు సత్యేంద్రనాథ్ యోగాభ్యాసాన్ని, ధ్యానాన్ని ఆయన తరచూ వీడియోలో బంధిస్తూ ఉంటారు.

View this post on Instagram

A post shared by Piyush Goyal (@goyalpp)

More Telugu News