నిరుద్యోగి భర్తకు నెలనెలా భరణం చెల్లించాల్సిందే.. ఇండోర్ కోర్టు కీలక తీర్పు
- ప్రతినెల రూ. 5000 చెల్లించాలంటూ భార్యకు ఆదేశం
- భర్త తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని భార్య ఆరోపణ
- ఆమే తనను వేధించిందంటూ కోర్టుకెక్కిన భర్త
- ఆమె కోసం తాను చదువును త్యాగం చేసి నిరుద్యోగిగా మిగిలిపోయానని భర్త ఆవేదన
- ఇరు పక్షాల వాదనల అనంతరం భర్తకు అనుకూలంగా కోర్టు తీర్పు
ఆమె వాంగ్మూలం పరస్పర విరుద్ధంగా ఉండడాన్ని ఈ సందర్భంగా న్యాయస్థానం గుర్తించింది. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తానో బ్యూటీ పార్లర్ నడుపుతున్నట్టు తొలుత పేర్కొంది. అయితే, ఆ తర్వాత కోర్టులో మాత్రం తానో నిరుద్యోగినని తెలిపింది. ఈ నేపథ్యంలో బలమైన సాక్ష్యం లేకపోవడంతో విడిపోయిన భర్తకు ప్రతినెల రూ. 5 వేల చొప్పున చెల్లించాల్సిందేనని తీర్పు చెప్పింది. భర్తకు భరణం చెల్లించాలని భార్యను కోర్టు ఆదేశించడం మధ్యప్రదేశ్‌లో ఇదే తొలిసారి కావడం గమనార్హం. సాధారణంగా ఇలాంటి కేసుల్లో భర్తలే భరణం చెల్లించాల్సి వస్తుందని న్యాయవాది తెలిపారు.