Anjali: కథకి తగ్గట్టుగా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' టీజర్ లాంచ్ అక్కడే!

  • అంజలి ప్రధాన పాత్రగా గతంలో హిట్ కొట్టిన 'గీతాంజలి'
  • హారర్ కామెడీ జోనర్లో అలరించిన సినిమా 
  • ఆ సినిమాకి సీక్వెల్ గా రూపొందిన 'గీతాంజలి మళ్లీ వచ్చింది'
  • బేగంపేట శ్మశానవాటికలో రిలీజ్ చేయనున్న టీజర్

Geethanjali Malli Vachindi Movie Update

అంజలి ప్రధానమైన పాత్రగా కొంతకాలం క్రితం 'గీతాంజలి' సినిమా వచ్చింది. హారర్ కామెడీ జోనర్లో వచ్చిన ఈ సినిమా, సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో ఆ సినిమాకి సీక్వెల్ గా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' రూపొందింది. కోన వెంకట్ కథను అందించిన ఈ సినిమాకి, శివ తుర్లపాటి దర్శకత్వం వహించాడు. కెరియర్ పరంగా అంజలికి ఇది 50వ సినిమా కావడం విశేషం. 

ఇది ప్రేతాత్మకి సంబంధించిన కథ .. ప్రేతాత్మ ప్రధానంగా నడిచే కథ. అందువలన కథకి తగినట్టుగానే ఈ సినిమాలో శ్మశానానికి సంబంధించిన సన్నివేశాలు ఉన్నాయి. ఈ కారణంగా  ఈ సినిమా టీజర్ ను శ్మశానంలో రిలీజ్ చేయాలనే నిర్ణయానికి మేకర్స్ వచ్చారు. తమ నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించారు. 

ఈ శనివారం రాత్రి 7 గంటలకు .. హైదరాబాద్ - బేగంపేట శ్మశాన వాటికలో ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఒక రకంగా టాలీవుడ్ కి సంబంధించి సినిమా ప్రమోషన్స్ కొత్త మలుపు తీసుకున్నాయనే అనుకోవాలి. శ్రీనివాస రెడ్డి .. సత్యం రాజేశ్ .. రవిశంకర్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News