Jagga Reddy: నా దూకుడును హరీశ్ రావు తట్టుకోలేక జైల్లో పెట్టించాడు: జగ్గారెడ్డి

  • కాంగ్రెస్ గెలిచిందన్న ఆనందంలో తన ఓటమి బాధను మర్చిపోయానన్న జగ్గారెడ్డి
  • తనకు కావాల్సిన పదవి తప్పకుండా వస్తుందని ధీమా
  • కేసీఆర్ సొంత జిల్లాలో లక్ష మందితో సభ పెట్టానని వెల్లడి
Harish Rao put me in jail says Jagga Reddy

తన జీవితమంతా కష్టాలతోనే గడిచిపోయిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు అలా రాసిపెట్టి ఉందని అన్నారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందనే ఆనందంలో తన ఓటమి బాధను మర్చిపోయానని చెప్పారు. తాను ఏ బాధ్యతను నిర్వహిస్తానో ఆ బాధ్యత తనకు తప్పకుండా వస్తుందని... కొంత టైమ్ పట్టినా రావాల్సిన బాధ్యత వస్తుందని అన్నారు. పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని ఐదేళ్లుగా అడుగుతున్నానని చెప్పారు. సీఎం రేవంత్ ఆధ్వర్యంలో అందరం కలసి పని చేసి 14 లోక్ సభ సీట్లను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ పీఎం కావడానికి 14 ఎంపీలను ఇస్తామని చెప్పారు. 

ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తనను పిలిచి రాహుల్ సభను పెడదామని అడిగారని... దీంతో, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఉన్న సమయంలో కేసీఆర్ సొంత జిల్లాలో లక్ష మందితో సభ పెట్టానని తెలిపారు. తన దూకుడును హరీశ్ రావు తట్టుకోలేక పోయారని... తనను టార్గెట్ చేసి జైల్లో వేయించారని చెప్పారు. బీఆర్ఎస్ లో చక్రం తిప్పే హరీశ్ జిల్లాలో తన మార్క్ ను చూపించానని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం సంతోషంగా ఉందని చెప్పారు.

More Telugu News