Blue Aadhaar: ఐదేళ్ల లోపు పిల్లల కోసం ‘బ్లూ ఆధార్’.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..!

  • తల్లిదండ్రుల ఆధార్ తో అనుసంధానం
  • స్కూల్ అడ్మిషన్ కు తప్పనిసరి
  • ఐదేళ్లు నిండాకే బయోమెట్రిక్ అప్ డేట్
What It Is Blue Aadhaar For Your Child And How to Apply

భారత దేశ పౌరులందరికీ కామన్ గుర్తింపు కార్డు ఆధార్.. ప్రస్తుతం ప్రతీ పనికీ ఆధార్ తప్పనిసరిగా మారింది. బ్యాంకు ఖాతా నుంచి మొదలుకొని ప్రభుత్వ పథకాలకు దీనినే ప్రామాణికంగా గుర్తిస్తున్నారు. చట్ట ప్రకారం కూడా ప్రతీ పౌరుడు.. రోజుల పసికందు నుంచి పండు ముసలి వరకు అందరూ ఆధార్ కార్డు తీసుకోవాల్సిందే. ఐదేళ్ల లోపు చిన్నారులకు కేంద్ర ప్రభుత్వం బ్లూ ఆధార్ (బాల ఆధార్) కార్డును అందజేస్తోంది. పిల్లలకు జారీ చేసే ఈ కార్డులో అక్షరాలను నీలి రంగులో ప్రింట్ చేయడం వల్ల దీనిని బ్లూ ఆధార్ అంటున్నారు. తల్లిదండ్రుల ఆధార్ తో అనుసంధానించి ఈ బ్లూ ఆధార్ కార్డును జారీ చేస్తారు. తాత్కాలికంగా(ఐదేళ్ల వ్యాలిడిటీతో) జారీ చేసే ఈ కార్డుకు బయోమెట్రిక్ అవసరంలేదు. పిల్లలకు ఐదేళ్లు నిండిన తర్వాత బయోమెట్రిక్ అప్ డేట్ చేయాల్సి ఉంటుంది. చిన్నారులను నర్సరీలో చేర్చాలన్నా.. రైల్వే, విమాన టికెట్ బుకింగ్ లో ఈ ఆధార్ తప్పనిసరి.
 
బ్లూ ఆధార్ కోసం ఇలా దరఖాస్తు చేసుకోవాలి..

  • ఆధార్ అధికారిక వెబ్ సైట్ లోకి లాగిన్ అయి మై ఆధార్ లో అపాయింట్ మెంట్ బుక్ చేసుకోవాలి.
  • చైల్డ్ ఆధార్ లోకి వెళ్లి న్యూ ఆధార్ పై క్లిక్ చేయాలి.
  • మొబైల్ నంబర్, వన్ టైమ్ పాస్ వర్డ్ తో కన్ఫార్మ్ చేసుకోవాలి.
  • ఐదేళ్ల లోపు చిన్నారి పేరు, పేరెంట్స్ వివరాలు, డేటాఫ్ బర్త్, తల్లిదండ్రుల చిరునామా నమోదు చేయాలి.
  • దగ్గర్లోని ఆధార్ సేవా కేంద్రంలో అపాయింట్ మెంట్ తీసుకోవాలి. నిర్ణీత సమయానికి ఆ సేవా కేంద్రానికి వెళ్లి బ్లూ ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలి. చిన్నారుల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, మీ ఆధార్ కార్డును వెంట తీసుకెళ్లడం మర్చిపోవద్దు. వారం పది రోజుల్లో మీ పిల్లల బ్లూ ఆధార్ కార్డు పోస్టులో మీ ఇంటికి చేరుతుంది.
  • చిన్నారులకు ఐదేళ్లు నిండాక బయోమెట్రిక్ అప్ డేట్ చేయాల్సి ఉంటుంది.

More Telugu News