Shivani Nagaram: హీరోయిన్ అవుతానని అనుకోలేదు: శివాని నగరం

  • ఇటీవల వచ్చిన 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు'
  • కథానాయికగా పరిచయమైన శివాని నగరం 
  • సక్సెస్ పట్ల స్పందించిన హీరోయిన్ 
  • ముందుగా పేరెంట్స్ భయపడ్డారని వెల్లడి

Shivani Nagaram Interview

తెలుగు తెరకి హీరోయిన్ గా మరో తెలుగు అమ్మాయి పరిచయమైంది. అందమైన ఆ అమ్మాయి పేరే శివాని నగరం. కొంతకాలం నుంచి యూ ట్యూబ్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న శివాని నగరం, 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయమైంది. తొలి సినిమాతోనే సక్సెస్ ను అందుకుంది. 

తాజాగా ఐ డ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో శివాని మాట్లాడుతూ .. "నేను హీరోయిన్ ను అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. నా కంఫర్ట్ ను బట్టి నేను యూ ట్యూబ్ కంటెంట్ ను ఇస్తూ వెళుతున్నాను. అలాంటి సమయంలో ఈ సినిమా నుంచి నాకు ఛాన్స్ వచ్చింది. సినిమా అనగానే పేరెంట్స్ కొంచెం భయపడ్డారు. కొంత ఆలోచన చేసిన తరువాత ఓకే చెప్పారు" అని అంది. 

" ఈ సినిమాను నేను 'శ్రీరాములు' థియేటర్లో ఆడియన్స్ తో కలిసి చూశాను. నా ఇంట్రడక్షన్ సీన్ లో విజిల్స్ పడటం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. నేను ఊహించిన దానికంటే ఎక్కువగా ఆడియన్స్ నా పాత్రను రిసీవ్ చేసుకున్నారు. ఈ సినిమా .. నేను పోషించిన లక్ష్మి పాత్ర నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి" అని చెప్పింది.

More Telugu News