ఓటమి భయంతో పత్రికలపై పగబట్టిన జగన్ దాడులకు ఉసిగొల్పుతున్నాడు: దేవినేని ఉమా

  • అనంతపురం, కర్నూలు జిల్లాల్లో మీడియా ప్రతినిధులపై వైసీపీ దాడులు
  • అక్రమాలను ప్రశ్నిస్తే తట్టుకోలేక పోతున్నారన్న దేవినేని ఉమా
  • జీ హుజార్ అనకపోతే హత్యలకు కూడా వెనుకాడటం లేదని ఆగ్రహం
అనంతపురం, కర్నూలు జిల్లాల్లో మీడియా ప్రతినిధులపై వైసీపీ శ్రేణులు దాడులు చేయడంపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ... ఓటమి భయంతో పత్రికలపై పగబట్టిన జగన్ రెడ్డి దాడులకు ఉసిగొల్పుతున్నారని విమర్శించారు. అక్రమాలను ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారని.. పత్రికా యాజమాన్యాలపై రోత పత్రికలో విషపు రాతలు రాస్తున్నారని దుయ్యబట్టారు. విలేకరులపై నిత్యం వేధింపులకు పాల్పడుతున్నారని... పత్రికా కార్యాలయాలపై దాడులు చేస్తున్నారని అన్నారు. జీ హుజూర్ అనకపోతే అధికార పార్టీ నేతలు హత్యలకు కూడా వెనుకాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ నిరంకుశ వైఖరి ప్రజాస్వామ్యం మనుగడకే ప్రశ్నార్థకమని అన్నారు.

Devineni Uma
Telugudesam
Jagan
YSRCP
Media

More Telugu News