BCCI: ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టుకు జట్టుని ప్రకటించిన బీసీసీఐ

  • 4వ టెస్టుకు బుమ్రాకు విశ్రాంతి ఇచ్చిన సెలక్టర్లు
  • కేఎల్ రాహుల్ కూడా ఆడడం లేదని బీసీసీఐ ప్రకటన
  • రాజ్‌కోట్ టెస్టుకు దూరమైన ముకేశ్ కుమార్‌కు చోటు
BCCI has announced the team for the fourth Test against England

భారత్ - ఇంగ్లండ్ మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో అత్యంత కీలకమైన నాలుగవ మ్యాచ్ శుక్రవారం నుంచి రాంచీ వేదికగా షురూ కానుంది. ముఖ్యమైన ఈ మ్యాచ్ కోసం భారత జట్టుని బీసీసీఐ ప్రకటించింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చింది. ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడంతో బుమ్రాకు విరామం ఇచ్చినట్టు పేర్కొంది.  ఇక బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ కూడా నాలుగవ టెస్టు ఆడడంలేదని తెలిపింది. ధర్మశాల వేదికగా జరగనున్న చివరి మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ ఆడడం అతడి ఫిట్‌నెస్‌‌కు లోబడి ఉంటుందని తెలిపింది. కాగా రాజ్‌కోట్ టెస్టుకు దూరంగా ఉన్న పేసర్ ముకేశ్‌ కుమార్‌‌ ను రాంచీ టెస్టుకి ఎంపిక చేసింది.

టీమిండియా జట్టు ఇదే..
రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, రజత్‌ పాటిదార్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్‌), కేఎస్‌ భరత్‌ (వికెట్‌ కీపర్‌), దేవ్‌దత్‌ పడిక్కల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, ముకేశ్‌ కుమార్‌, ఆకాశ్‌ దీప్‌.

కాగా నాలుగవ టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రా అందుబాటులో లేకపోవడం కాస్త మైనస్‌గా భావించాలి. మంచి ఫామ్‌లో ఉన్న బుమ్రా ఈ సిరీస్‌లో ఇప్పటివరకు అత్యధికంగా 17 వికెట్లు తీశాడు. వైజాగ్ వేదికగా జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్‌లో ఒంటి చేత్తో జట్టుని గెలిపించాడు.

More Telugu News