iPhone: ఐఫోన్ నీళ్లలో పడితే ఇలా చేయొద్దు: ఆపిల్

  • ఫోన్ నీళ్లలో పడితే బియ్యం సంచిలో పెట్టొద్దన్న ఆపిల్
  • బియ్యంలోని సూక్ష్మ రేణువులు ఫోన్ ను డ్యామేజీ చేస్తాయని వెల్లడి
  • ఐఫోన్ నీళ్లలో పడితే ఏం చేయాలో చెప్పిన ఆపిల్ 
Apple says do not drop wet iPhone into rice bag

ఐఫోన్ తయారీదారు ఆపిల్ సంస్థ తన వినియోగదారులకు కీలక సూచన చేసింది. చాలామంది ఫోన్ నీళ్లతో పడితే, ఈ ఫోన్ ను బియ్యం సంచిలో  పెడతారని, కానీ అది చాలా పొరపాటు అని వెల్లడించింది. 

నీళ్లలో పడిన ఐఫోన్ ను బియ్యం సంచిలో పెట్టడం వల్ల బియ్యంలోని సూక్ష్మ రేణువులు ఫోన్ ను డ్యామేజి చేస్తాయని వివరించింది. ఐఫోన్ నీళ్లలో పడినప్పుడు... కనెక్టర్ ను కింది వైపుకు ఉండేలా ఫోన్ ను వంచి నెమ్మదిగా చేత్తో కొట్టాలని, అనంతరం ఫోన్ ను పొడిగా ఉండే ప్రదేశంలో ఉంచాలని ఆపిల్ సూచించింది. 

నీళ్లలో పడిన వెంటనే చార్జింగ్ పెట్టొద్దని, 30 నిమిషాల తర్వాతే చార్జింగ్ చేయాలని స్పష్టం చేసింది. అయితే, ఐఫోన్ లోకి ప్రవేశించిన నీరు మొత్తం పూర్తిగా తొలగిపోయేందుకు 24 గంటల సమయం పడుతుందని, ఫోన్ స్టేటస్ తెలుసుకోవాలంటే లిక్విడ్ డిటెక్షన్ అలర్ట్ ఫీచర్ ను ఉపయోగించుకోవాలని ఆపిల్ పేర్కొంది. 

నీటిలో 30 నిమిషాలు ఉన్నప్పటికీ ఐఫోన్ భేషుగ్గా పనిచేస్తుందని వెల్లడించింది. ఫోన్ తడిగా ఉన్నప్పటికీ చార్జింగ్ చేయాల్సి వస్తే లిక్విడ్ డిటెక్షన్ ఫీచర్ ను ఓవర్ రైడ్ చేయవచ్చని వివరించింది.

More Telugu News