KL Rahul: రాంచీ టెస్టుకు కేఎల్ రాహుల్ సిద్ధం!

  • టీమిండియా-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్
  • తొలి టెస్టులో గాయం తిరగబెట్టడంతో కేఎల్ రాహుల్ కు విశ్రాంతి
  • గత రెండు టెస్టులకు జట్టుకు దూరమైన వైనం
  • ఈ నెల 23 నుంచి రాంచీలో టీమిండియా-ఇంగ్లండ్ నాలుగో టెస్టు
  • అప్పటికల్లా రాహుల్ పూర్తి ఫిట్ నెస్ సాధించే అవకాశం
KL Rahul likely play in Ranchi test starts from Feb 23

తొడ కండరాల గాయంతో గత రెండు టెస్టులకు దూరమైన టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్ దాదాపుగా కోలుకున్నాడు. ఫిబ్రవరి 23 నుంచి రాంచీలో జరిగే నాలుగో టెస్టు నాటికి పూర్తి ఫిట్ నెస్ సాధించే అవకాశాలున్నాయి. 

టీమిండియా-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ లో కేఎల్ రాహుల్ తొలి టెస్టు మాత్రమే ఆడాడు. విశాఖలో జరిగిన రెండో టెస్టులోనూ, రాజ్ కోట్ లో నిన్న ముగిసిన మూడో టెస్టులోనూ ఆడలేదు. రాహుల్ పరిస్థితిపై బీసీసీఐ వర్గాలు స్పందించాయి. గత వారం నాటికి రాహుల్ 90 శాతం ఫిట్ నెస్ సాధించాడని ఓ అధికారి వెల్లడించారు. పూర్తి మ్యాచ్ ఫిట్ నెస్ అందుకునే దిశగా రాహుల్ శ్రమిస్తున్నాడని, రాంచీ టెస్టుకు అతడు అందుబాటులో ఉండే అవకాశాలున్నాయని తెలిపారు. 

గతేడాది కూడా ఐపీఎల్ సమయంలో కేఎల్ రాహుల్ ఇదే గాయంతో ఇబ్బందిపడ్డాడు. నాలుగు నెలల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఇంగ్లండ్ తో హైదరాబాదులో జరిగిన తొలి టెస్టులో ఆ గాయం మళ్లీ తిరగబెట్టింది.

More Telugu News