TSPSC: తెలంగాణ గ్రూప్-1 పోస్టులకు కొత్త నోటిఫికేషన్ విడుదల... వయోపరిమితి పెంపు

  • 563 పోస్టులతో టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్
  • 23వ తేదీ నుంచి 14వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ
  • పోస్టుల వివరాలు, వయో పరిమితి, వేతనం తదితర వివరాలతో నోటిఫికేషన్ విడుదల
Group 1 new notification released

తెలంగాణలో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైంది. 563 పోస్టులతో టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ నెల 23వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ప్రభుత్వం వయోపరిమితిని 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచింది. మార్చి 14న సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు. మే/జూన్ నెలల్లో ప్రిలిమినరీ పరీక్షలు, సెప్టెంబర్/అక్టోబర్ నెలల్లో మెయిన్స్ నిర్వహిస్తారు. 

పోస్టుల వివరాలు, వయో పరిమితి, వేతనం తదితర పూర్తి వివరాలతో ఈ రోజు సాయంత్రం నోటిఫికేషన్ విడుదల అయింది. దరఖాస్తు తర్వాత ఎడిట్ చేసుకునేందుకు 23 మార్చి ఉదయం 10 గంటల నుంచి 27 మార్చి సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించారు. హాల్ టిక్కెట్‌ను ఏడు రోజుల ముందు నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

More Telugu News