Chandrababu: దమ్ముంటే చర్చకు రా.. జగన్‌కు చంద్రబాబు సవాల్

Chandrababu Open Challenge to Jagan
షార్ట్స్‌లో చూడండి
ఏపీ సీఎం జగన్ పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని వార్నింగ్ ఇచ్చారు. రెక్కలు తెగిన ఫ్యాన్‌ను విసిరిపారేసేందుకు జనాలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. జగన్‌ది విధ్వంసక పాలన అని మండిపడ్డారు. దమ్ముంటే తనతో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. 

‘‘బాదుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేసి, విధ్వంసపోకడలతో రాష్ట్ర భవిష్యత్‌ను కూల్చేశారు. ఇప్పుడు ర్యాంప్‌ వాక్ చేసి అబద్ధాలు చెబితే ప్రజలెలా నమ్ముతారు జగన్ రెడ్డీ? నీకు, నీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఇంకా 50 రోజులే. వరం ఇచ్చిన శివుడినే బూడిద చేయాలనుకున్న భస్మాసురుడి గతే నీకూ పడుతుంది. బూటకపు ప్రసంగాలు కాదు, అభివృద్ధిపై దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు రా! ప్లేస్, టైం నువ్వే చెప్పు. ఎక్కడికైనా వస్తా, దేనిమీదైనా చర్చిస్తా, నువ్వు సిద్ధమా జగన్ రెడ్డి’’ అని చంద్రబాబు ఛాలెంజ్ చేశారు.
Go Back to Shorts
Chandrababu
YS Jagan
Telugudesam
YSRCP

More Telugu News