APRTC: ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల రంగుల్లో మార్పు!

APRTC bus colors changed
  • సుదూర ప్రాంతాలకు వెళ్లే సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సుల రంగుల్లో మార్పు
  • లగ్జరీ బస్సులకు నీలం, లేత ఊదా, లేత నీలం రంగులు
  • అల్ట్రా డీలక్స్‌లకు తెలుపు, నీలం, ఆరెంజ్ రంగు
ఏపీఎస్ ఆర్‌టీసీకి చెందిన సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సుల రంగులు మారనున్నాయి. ఇప్పటికే 30 వరకూ బస్సులకు కొత్త రంగులు వేశారు. సూపర్ లగ్జరీ బస్సులకు ప్రస్తుతం పసుపు, తెలుపు, ఎరుపు రంగులు ఉండగా వాటికి నీలం, లేత ఊదా, లేత నీలం రంగులు వేశారు. ఇక ఊదా, నీలం, తెలుపు రంగుల్లోని అల్ట్రా డీలక్స్ బస్సుల రంగును తెలుపు, నీలం, ఆరెంజ్ రంగుల్లోకి మార్చారు. విజయవాడ విద్యాధరపురంలోని ఆర్టీసీ వర్క్‌షాపు పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో 30 కొత్త బస్సులను సిద్ధం చేసి ఉంచారు. త్వరలో వీటిని ప్రారంభించనున్నామని అధికారులు వెల్లడించారు.
APRTC
Andhra Pradesh
Vijayawada

More Telugu News