క్రైస్తవ మత సంప్రదాయం ప్రకారం రాజారెడ్డి-ప్రియా పెళ్లి... ఫొటోలు పంచుకున్న షర్మిల
- జోథ్ పూర్ లో అంగరంగ వైభవంగా షర్మిల తనయుడి పెళ్లి
- తల్లిగా తన జీవితంలో ఇది మరొక ఘట్టం అంటూ షర్మిల ట్వీట్
- వేచి చూసిన క్షణాలు ఎట్టకేలకు వచ్చాయని వెల్లడి
"ఓ తల్లిగా నా జీవితంలో ఇది మరొక సంతోషకరమైన ఘట్టం. వేచి చూసిన ఆ క్షణాలు ఎట్టకేలకు వచ్చాయి. సర్వశక్తిమంతుడైన ఆ భగవంతుడి అంతులేని కృప, సన్నిహితుల దీవెనలు, శుభాకాంక్షలతో ఈ శుభకార్యం జరిగింది. నా బిడ్డ తన మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లాడాడు. కొన్ని అద్భుతమైన క్షణాలు ఎప్పటికీ పదిలంగా ఉండిపోతాయి" అని షర్మిల పేర్కొన్నారు.

