Nara Lokesh: అలాంటి వ్యక్తిని మీకివ్వడం మేం చేసిన పొరపాటు: నారా లోకేశ్

Nara Lokesh speech in Visakha south constituency
  • విశాఖ దక్షిణ నియోజకవర్గంలో లోకేశ్ శంఖారావం
  • మీరు వద్దన్నా ఒక వ్యక్తిని రెండు సార్లు ఎమ్మెల్యేగా ఇచ్చామన్న లోకేశ్
  • అందుకు మమ్మల్ని క్షమించాలి అంటూ విజ్ఞప్తి
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ సాయంత్రం విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో శంఖారావం సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... విశాఖ సౌత్ నియోజకవర్గం మతసామరస్యానికి మారుపేరు వంటిదని అన్నారు. ఒకే కొండపై ఆలయం, మసీదు, చర్చి ఉంటాయని వెల్లడించారు. 

"గతంలో మేమొక పొరపాటు చేశాం. మీరందరూ వద్దన్నా మీకు ఒక వ్యక్తిని రెండు సార్లు ఎమ్మెల్యేగా ఇచ్చాం. మీరు ఆ వ్యక్తిని గెలిపించారు. కానీ అలాంటి వ్యక్తిని మీకివ్వడం మేం చేసిన పొరపాటు. అందుకే మమ్మల్ని పెద్ద మనసుతో క్షమించండి. అలాంటి వ్యక్తులకు ఇకమీదట టీడీపీలో నో ఎంట్రీ. 

ఇక రుషికొండకు గుండు కొట్టారు. అక్కడ ఒక్క వ్యక్తి కోసం రూ.500 కోట్లతో ప్యాలెస్ కడుతున్నారు. గత రాత్రి వెళ్లి ఆ ప్యాలెస్ చూశాను. ఒక్క వ్యక్తికి అంత పెద్ద ప్యాలెస్ ఎందుకో అర్థం కాలేదు. అందులోని బెడ్ రూమే చంద్రబాబు ఇల్లంత ఉంది. మేం అధికారంలోకి వచ్చాక ఆ ప్యాలెస్ ను ప్రజల పరం చేస్తాం. 

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రా యూనివర్సిటీని ఎంతో అభివృద్ధి చేశారు. ఆ సమయంలో ఆంధ్రా యూనివర్సిటీ దేశంలోనే 29వ స్థానంలో ఉండేది. 

అలాంటిది, ఈ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక యూనివర్సిటీలో ప్రసాదరెడ్డి అనే ఒక వెధవను వైస్ చాన్సలర్ గా కూర్చోబెట్టారు. ఆ వెధవ వీసీ అయ్యాక వర్సిటీ 29వ స్థానం నుంచి 76వ స్థానానికి పడిపోయింది. విశాఖకు ఉన్న మంచి విద్యా సంస్థ ఆంధ్రా యూనివర్సిటీ. అలాంటి విశ్వవిద్యాలయాన్ని కూడా ఈ ముఖ్యమంత్రి నాశనం చేస్తున్నాడు" అంటూ మండిపడ్డారు.

ఈ స్త్రీ శక్తిని చూసి తాడేపల్లి కొంపలో టీవీలు పగులుతున్నాయి

విశాఖపట్నం పశ్చిమ నియోజకర్గం శంఖారావం సభలోనూ నారా లోకేశ్ ప్రసంగించారు.    పోరాటాల పౌరుషాల గడ్డ ఉత్తరాంధ్ర అని కీర్తించారు.టీడీపీ హయాంలో నెలకో పరిశ్రమ విశాఖకు వచ్చేదని, తాను ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి 15 రోజులకు ఒక ఐటీ కంపెనీని ప్రారంభించేవాడ్నని గుర్తు చేసుకున్నారు. ఇవాళ సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నాను.    దర్శనానికి వెళ్లిన సమయంలో ఓ అమ్మ అడిగింది... మీరు ఎప్పుడు విశాఖ వచ్చినా అప్పన్నను దర్శించుకుంటారు...జగన్ ఎప్పుడు వచ్చినా దర్శనం చేసుకోడు ఎందుకు అని?...    ఆ తల్లికి చెప్పా... రేపు సీఎం వస్తున్నారంట.. ఆయన్నే అడగాలని. ఎక్కడ ఆదాయం ఉంటే అక్కడకి మాత్రమే జగన్ వెళతాడని ఓ కుర్రాడు  చెప్పాడు.

జగన్ సైలెంట్ గా పోర్టులు కొట్టేస్తున్నాడు!

జగన్ జలగ లాంటివాడు. సైలెంట్ గా పోర్టులు కొట్టేస్తున్నాడు. కృష్ణపట్నం పోర్టు కొట్టేసి 10 వేల మంది కార్మికుల పొట్టగొట్టాడు. టీడీపీ నేతలు పోరాడితే కేరళలో కంటైనర్ షిప్ కు బెర్త్ దొరక్కపోతే ఆ కంటైనర్ షిప్ తెచ్చి కృష్ణపట్నంలో పెట్టి మరమ్మతులు చేస్తున్నామని నాటకమాడుతున్నారు.    నెల్లూరులో కోర్టు దొంగ ఉన్నాడు... ఆయన పేరు కాకాణి గోవర్థన్ రెడ్డి. కంటైనర్ వచ్చేటప్పుడు అర్థరాత్రి వీడియోలు తీసి చూడండి అని డ్రామాలు ఆడుతున్నాడు. ఈ ప్రభుత్వం అద్భుతమైన నాటకాలకు ఇదొక ఉదాహరణ. 

జగన్ కు ఖైదీలంటే ఇష్టం

గూగుల్ లో 6093 అని కొడితే ఖైదీ జగన్ ఫొటో వస్తోంది. 16 నెలలు జైల్లో చిప్పకూడు తిన్నాడు. ఖైదీలంటే జగన్ కు ఇష్టం... అందుకే జైల్లో ఖైదీలకు నెలకు రూ.2 వేలు ఇస్తున్నాడు కానీ స్కూలు పిల్లలకు కాస్మోటిక్ ఛార్జీలు పెంచడం లేదు. హాస్టళ్లలో పాచిపోయిన భోజనం పెడుతున్నారు. టాయిలెట్లు కూడా సరిగా లేవు. బలహీనవర్గాల విద్యార్థులకు హామీ ఇస్తున్నా... టీడీపీ-జనసేన ప్రభుత్వం వచ్చాక మెస్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు పెంచుతాం. విద్యాదీవెన, వసతి దీవెన పేరుతో మోసం చేస్తున్నాడు..వీటిని రద్దు చేసి గతంలో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ విధానాన్ని తీసుకొస్తాం. 

విశాఖ ఉక్కును కాపాడతాం

ఎందరో పోరాడి విశాఖ ఉక్కును సాధించారు. కానీ జగన్ ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నాడు. టీడీపీ అధికారంలోకి వస్తే విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కానివ్వం... అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి కాపాడతాం.    విశాఖలో భూ కుంభకోణాలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. దసపల్లా, హయగ్రీవ, ఎక్స్ సర్వీస్ మెన్ భూములు...ఎక్కడ చెరువులు కనబడ్డా రాత్రికి రాత్రే కాజేస్తున్నారు. మళ్లీ వస్తే మన ఎదురుగా ఉన్న సింహాచలం కొండలను కూడా కాజేస్తారు. 

సమయం తక్కువగా ఉంది 

టీడీపీ-జనసేన కలిసి సైకోను తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైంది. మనకు తక్కువ సమయం ఉంది... అందుకే, సూపర్-6 పథకాలను ప్రజల్లోకి వీలైనం త్వరగా, బలంగా తీసుకెళ్లాలి. వచ్చేది టీడీపీ-జనసేన ప్రభుత్వమే. హలో ఏపీ... బైబై వైసీపీ... ఈ నినాదంతో టీడీపీ-జనసేన కార్యకర్తలు ముందుకు కదలాలి.

నారా లోకేశ్ శంఖారావం వివరాలు
ఉమ్మడి విశాఖ జిల్లా


19-2-2024 (సోమవారం) కార్యక్రమ వివరాలు

విశాఖపట్నం ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం
(బిర్లా జంక్షన్ గ్రౌండ్, విశాఖపట్నం)
ఉదయం
10.00 – విశాఖపట్నం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రసంగం.
10.05 – విశాఖపట్నం అర్బన్ జనసేన అధ్యక్షుడు వంశీకృష్ణ యాదవ్ ప్రసంగం.
10-15 – బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, మన టీడీపీ యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేశ్ అభినందన.
10.30  – విశాఖపట్నం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి ముతుకుమిల్లి భరత్ ప్రసంగం.
10.32 – విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ జనసేన సమన్వయకర్త శ్రీమతి పి.ఉషా కిరణ్ ప్రసంగం.
10.34– విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ గంటా శ్రీనివాసరావు ప్రసంగం.
10.36– విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ శంఖారావం సభలో యువనేత లోకేశ్ ప్రసంగం.
10.56– పార్టీ కేడర్ తో లోకేశ్ ముఖాముఖి.
11.26– పార్టీ కేడర్ కు లోకేశ్ చేతులమీదుగా సూపర్-6 కిట్ల అందజేత.
11.28– పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ చేయించనున్న లోకేశ్.
11.29 – పార్టీకేడర్ తో లోకేశ్ గ్రూప్ సెల్ఫీ.
11.50 – నారా లోకేశ్ గాజువాక నియోజకవర్గానికి చేరిక.
12.00 – గాజువాక నియోజకవర్గంలో భోజన విరామం.

గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం
(లంక గ్రౌండ్, సీఎంఆర్ మాల్ వద్ద, విశాఖపట్నం) 
మధ్యాహ్నం
1.30 – విశాఖపట్నం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రసంగం.
1.35 – విశాఖపట్నం అర్బన్ జనసేన అధ్యక్షుడు వంశీకృష్ణ యాదవ్ ప్రసంగం.
1-45 – బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, మన టీడీపీ యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేశ్ అభినందన.
2.00 – విశాఖ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి ముతుకుమిల్లి భరత్ ప్రసంగం.
2.02 – గాజువాక నియోజకవర్గ జనసేన సమన్వయకర్త కోన తాతారావు ప్రసంగం. 
2.04 – గాజువాక నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ పల్లా శ్రీనివాసరావు ప్రసంగం.
2.06– గాజువాక నియోజకవర్గ సభలో లోకేశ్ ప్రసంగం.
2.26– పార్టీ కేడర్ తో లోకేశ్ ముఖాముఖి.
2.54– పార్టీ కేడర్ కు లోకేశ్ చేతులమీదుగా సూపర్ - 6 కిట్ల అందజేత.
2.58– పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ చేయించనున్న లోకేశ్.
2.59 – పార్టీకేడర్ తో లోకేశ్ సెల్ఫీ.
3.30 – అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి లోకేశ్ చేరిక

అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం
(జేఎన్ జే హైస్కూల్ ఎదురు, అనకాపల్లి పట్టణం)
సాయంత్రం
4.00 – అనకాపల్లి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు బుద్ధా నాగ జగదీష్ ప్రసంగం.
4.05 – విశాఖపట్నం రూరల్ జనసేన అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు ప్రసంగం.
4-15 – బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, మన టీడీపీ యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేశ్ అభినందన.
4.32 – అనకాపల్లి నియోజకవర్గ జనసేన సమన్వయకర్త పర్చూరి భాస్కర్ రావు ప్రసంగం.
4.34 – అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ పీలా గోవింద సత్యనారాయణ ప్రసంగం.
4.36 – అనకాపల్లి నియోజకవర్గ శంఖారావంలో నారా లోకేశ్ ప్రసంగం.
4.56 – పార్టీ కార్యకర్తలతో లోకేశ్ ముఖాముఖి.
5.26 – పార్టీ కేడర్ కు బాబు సూపర్ సిక్స్ కిట్ల అందజేత.
5.28 – టీడీపీ కార్యకర్తలచే లోకేశ్ ప్రతిజ్ఞ.
5.29 – పార్టీ కేడర్ తో లోకేశ్ గ్రూప్ సెల్ఫీ.
6.15 – రోడ్డుమార్గం ద్వారా చోడవరం నియోజకవర్గానికి ప్రయాణం.

చోడవరం అసెంబ్లీ నియోజకవర్గం
(హైస్కూల్ గ్రౌండ్, వడ్డాది పంచాయతీ)
సాయంత్రం
6.30 – అనకాపల్లి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు బుద్ధా నాగ జగదీష్ ప్రసంగం.
6.35 – విశాఖపట్నం రూరల్ జనసేన అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు ప్రసంగం.
6-45 – బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, మన టీడీపీ యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేశ్ అభినందన.
7.02 – చోడవరం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త పీవీఎస్ఎన్ రాజు ప్రసంగం.
7.04 – చోడవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ బత్తుల తాతయ్యబాబు ప్రసంగం.
7.06 – చోడవరం నియోజకవర్గ శంఖారావంలో నారా లోకేశ్ ప్రసంగం.
7.26 – పార్టీ కార్యకర్తలతో లోకేశ్ ముఖాముఖి.
7.54 – పార్టీ కేడర్ కు బాబు సూపర్ సిక్స్ కిట్ల అందజేత.
7.58 – టీడీపీ కార్యకర్తలచే లోకేశ్ ప్రతిజ్ఞ.
7.59 – పార్టీ కేడర్ తో లోకేశ్ గ్రూప్ సెల్ఫీ.
8.00 – రోడ్డుమార్గం ద్వారా మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రయాణం.
8.20 – మాడుగుల ఘాట్ రోడ్ జంక్షన్ (వడ్డాది-పాడేరు రోడ్డు)లో బస చేస్తారు.
Nara Lokesh
Shankharavam
Visakha South
TDP

More Telugu News