Nara Lokesh: నేను చెప్పింది కరెక్టే: నారా లోకేశ్

  • ఉత్తరాంధ్రలో లోకేశ్ పర్యటన
  • భీమిలి నియోజకవర్గంలో శంఖారావం సభ
  • జగన్ తో ఫుట్ బాల్ ఆడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్న లోకేశ్
  • కుర్చీ వ్యాఖ్యలను మరోసారి ప్రస్తావించిన వైనం
Nara Lokesh speech at Thagarapuavalasa meeting

భీమిలి నియోజకవర్గం తగరపువలస శంఖారావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రసంగించారు. ఉత్తరాంధ్ర గర్జించింది... ఆ గర్జనకు ప్యాలెస్ పిల్లి మియావ్ అనే పరిస్థితికి వచ్చిందంటూ ఎద్దేవా చేశారు. 

పోరాటాలు, పౌరుషాల గడ్డ మన ఉత్తరాంధ్ర... జగన్ ఇన్నాళ్లూ ఇక్కడి ప్రజలతో ఓ ఆట ఆడారు... రెండు నెలలు ఓపిక పట్టండి... మనం జగన్ తో ఫుట్ బాల్ ఆడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. 

"జగన్ మొన్న మీటింగ్ లో మాట్లాడుతూ, వైసీపీ వాళ్లు షర్ట్ మడత పెట్టాలని చెప్పారు. నిన్న జగన్ కుర్చీ మడత పెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని నేనంటే... అరగంట అంబటికి కోపం వచ్చింది. అది కుర్చీ కాదు సింహాసనం అంటున్నారు. అది సింహాసనమే. అయితే నేను చెప్పింది దాని మీద కూర్చున్న శునకం గురించి. ఆ శునకాన్ని తరిమితరిమి కొట్టే రోజులు దగ్గర్లనే ఉన్నాయని. నేను చెప్పింది కరెక్టే" అంటూ లోకేశ్ చమత్కరించారు.  

జగన్ ఓటమికి దేవుడు స్క్రిప్ట్ సిద్ధం చేశాడు


జగన్ ఓటమికి దేవుడు స్క్రిప్ట్ రెడీ చేశారు. వైసీపీ తరపున పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు దొరకడం లేదు. విశాఖ ఎంపీగా పక్క జిల్లా నుంచి ఓ మహిళను తీసుకువచ్చారు. ఒంగోలు ఎంపీగా చిత్తూరుకు చెందిన, చెవిలో పూలు పెట్టే చెవిరెడ్డిని తీసుకువచ్చారు. నెల్లూరు ప్రజలు ఛీ పో అన్న అనిల్ కుమార్ యాదవ్ ను నరసరావుపేట తీసుకువచ్చారు. 

గుంటూరు ఎంపీగా పోటీచేయడానికి వచ్చిన క్రికెటర్ అంబటి రాయుడు పారిపోయారు. కర్నూలు ఎంపీగా సొంత పార్టీ మంత్రిని నిలబడమంటే నాకొద్దని బాయ్ బాయ్ జగన్ అని చెప్పారు. తిరుపతి ఎంపీగా సొంత ఎమ్మెల్యే ఆదిమూలంను నిలబడాలంటే పారిపోయారు. 175 నియోజకవర్గాల్లో 75 స్థానాల్లో అభ్యర్థులు దొరకని పరిస్థితి.

 నా చరిత్ర స్టాన్ ఫోర్డ్ ఎంబీయే... నీ చరిత్ర టెన్త్ క్లాస్ పేపర్ లీక్

నాది అంబేద్కర్ రాజ్యాంగం. నీది రాజారెడ్డి రాజ్యాంగం. నేను ప్రజల్లో ఉంటా. నువ్వు పరదాల చాటున ఉంటావు. నేను 25వేల కి.మీల సీసీ రోడ్లు వేస్తే నువ్వు కనీసం గుంతలు కూడా పూడ్చలేకపోయావు. నేను టీసీఎల్, హెచ్ సీఎల్, ఫాక్స్ కాన్, అదానీ లాంటి పరిశ్రమలు తీసుకువస్తే .. నువ్వు బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్రా గోల్డ్ తీసుకువచ్చావు. నేను స్టాన్ పోర్డ్ లో ఎంబీయే చేస్తే నీది టెన్త్ క్లాస్ పేపర్ లీక్ చేసిన చరిత్ర. 

ప్రజల కష్టాలు చూసి ఈ సూపర్ -6 పథకాలు ప్రకటించారు 

ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేం తీసుకుంటాం. ప్రతి ఏటా డీఎస్సీ ప్రకటిస్తాం. పద్దతి ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఉద్యోగం రాని వారికి అప్పటి వరకు 3 వేల నిరుద్యోగ భృతి ఇస్తాం. 

స్కూల్ కు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15వేలు ఇస్తాం, ఒక్కరుంటే రూ.15వేలు, ఇద్దరుంటే రూ.30వేలు, ముగ్గురుంటే ఏడాదికి రూ.45 వేలు ఇస్తాం. రైతుల్ని ఆదుకునేందుకు ప్రతి రైతుకు సంవత్సరానికి రూ.20 వేలు ఆర్థిక సాయం చేస్తాం. 

ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం. 

18 నుంచి 59 ఏళ్ల వయసున్న మహిళలకు ప్రతి నెల రూ.1,500 ఇస్తాం, ఏడాదికి రూ.18 వేలు, ఐదేళ్లలో రూ.90 వేలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఆరో హామీ ఆర్టీసీ బస్సుల్లో తెలుగు మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. 
 
ఇక్కడ పోటీ చేసి ఉంటే ఎమ్మెల్యే అయ్యేవాడ్ని!

భీమిలితో నాకు అనుబంధం ఉంది. 2019లో నన్ను భీమిలి నుంచి పోటీచేయాలని చంద్రబాబు సూచించారు. ఎప్పుడూ గెలవని మంగళగిరి నుంచి పోటీచేస్తానని చెప్పా. స్వల్ప మెజార్టీతో ఓడిపోయాను. ఇక్కడ పోటీ చేసి ఉంటే నేను ఎమ్మెల్యేగా, భరత్ ఎంపీ అయ్యేవాళ్లం. భీమిలిని నా గుండెల్లో పెట్టుకుని అభివృద్ధి చేస్తా. 

అరగంట అవంతి మంత్రిగా పనిచేశారు... కానీ ఏం చేశారు?

అరగంట అవంతి మంత్రిగా పనిచేశారు. ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు. మీ జీవితాల్లో ఏమైనా మార్పులు వచ్చాయా? ఆయన రాసలీలల ఫోన్ కాల్స్, ఏకంగా షర్ట్ తీసి వీడియోకాల్స్ మాత్రం చేశారు. భీమిలి పరువు తీశారు. అవమానించారు. ఎవరైనా మాది భీమిలి అంటే ఆ వీడియో మాకు కూడా వచ్చిందని చెప్పే పరిస్థితి. 

అవంతి శ్రీనివాస్ అభివృద్ధికి కేరాఫ్ గా ఉన్న భీమిలిని అవినీతికి కేరాఫ్ గా మార్చారు. వైసీపీ నాయకులందరూ ఇక్కడకు వచ్చి అడ్డగోలుగా భూములు కాజేస్తున్నారు. అంగన్ వాడీ పోస్టులు, అవుట్ సోర్సింగ్ పోస్టులు, లైన్ మెన్ పోస్టులు కూడా అమ్ముకుంటున్నారు.

యువనేత నారా లోకేష్ శంఖారావం వివరాలు

ఉమ్మడి విశాఖ జిల్లా

18-2-2024 (ఆదివారం) కార్యక్రమ వివరాలు
విశాఖపట్నం తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం
(గాదిరాజు ప్యాలెస్, బీచ్ రోడ్డు, విశాఖపట్నం)

  • ఉదయం

  • 10.00 – విశాఖపట్నం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ప్రసంగం.
  • 10.05 – విశాఖపట్నం అర్బన్ జనసేన అధ్యక్షులు వంశీకృష్ణ యాదవ్ ప్రసంగం.
  • 10-15 – బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, మన టిడిపి యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేష్ అభినందన.
  • 10.30  – విశాఖపట్నం పార్లమెంట్ టిడిపి అభ్యర్థి ముతుకుమిల్లి భరత్ ప్రసంగం.
  • 10.32 – విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త బొలిశెట్టి సత్యనారాయణ ప్రసంగం.
  • 10.34– విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ వెలగపూడి రామకృష్ణ బాబు ప్రసంగం.
  • 10.36– విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ శంఖారావం సభలో యువనేత లోకేష్ ప్రసంగం.
  • 10.56– పార్టీ కేడర్ తో లోకేష్ ముఖాముఖి.
  • 11.26– పార్టీ కేడర్ కు లోకేష్ చేతులమీదుగా సూపర్ - 6 కిట్ల అందజేత.
  • 11.28– పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ చేయించనున్న లోకేష్.
  • 11.29 – పార్టీకేడర్ తో  యువనేత లోకేష్ గ్రూప్ సెల్ఫీ.
  • 11.45 – యువనేత నారా లోకేష్ విశాఖ దక్షిణ నియోజకవర్గానికి చేరిక.
  • 12.30 – విశాఖ దక్షిణ నియోజకవర్గంలో భోజన విరామం.
  • విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం
  • (ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, జగదాంబ జంక్షన్)

  • మధ్యాహ్నం

  • 2.00 – విశాఖపట్నం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ప్రసంగం.
  • 2.05 – విశాఖపట్నం అర్బన్ జనసేన అధ్యక్షులు వంశీకృష్ణ యాదవ్ ప్రసంగం.
  • 2-15 – బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, మన టిడిపి యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేష్ అభినందన.
  • 2.30 – విశాఖ పార్లమెంట్ టిడిపి అభ్యర్థి ముతుకుమిల్లి భరత్ ప్రసంగం.
  • 2.32 – విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త పి.శివప్రసాద్ రెడ్డి ప్రసంగం. 
  • 2.34 – విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ గండి బాబ్జి ప్రసంగం.
  • 2.36– విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ సభలో యువనేత లోకేష్ ప్రసంగం.
  • 2.56– పార్టీ కేడర్ తో యువనేత లోకేష్ ముఖాముఖి.
  • 3.26– పార్టీ కేడర్ కు లోకేష్ చేతులమీదుగా సూపర్ - 6 కిట్ల అందజేత.
  • 3.28– పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ చేయించనున్న లోకేష్.
  • 3.29 – పార్టీకేడర్ తో  యువనేత లోకేష్ సెల్ఫీ.
  • 4.00 – యువనేత విశాఖపట్నం పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి చేరిక.
  • విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం
  • (వెంకటాపురం ఓపెన్ గ్రౌండ్, గోపాలపట్నం హెచ్ పి పెట్రోలు బంకుదగ్గర)

  • సాయంత్రం

  • 4.30 – విశాఖపట్నం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ప్రసంగం.
  • 4.35 – విశాఖపట్నం అర్బన్ జనసేన అధ్యక్షులు వంశీకృష్ణ యాదవ్ ప్రసంగం.
  • 4-45 – బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, మన టిడిపి యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేష్ అభినందన.
  • 5.00 – విశాఖపట్నం పార్లమెంట్ టీడీపీ అభ్యర్తి ముతుకుమిల్లి భరత్ ప్రసంగం.
  • 5.02 – విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త శ్రీమతి ఏ.దుర్గా ప్రశాంతి ప్రసంగం.
  • 5.04 – విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ టిడిపి ఇన్ చార్జ్ పీజీవీఆర్ నాయుడు(గణబాబు) ప్రసంగం.
  • 5.06 – విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ శంఖారావంలో యువనేత నారా లోకేష్ ప్రసంగం.
  • 5.26 – పార్టీ కార్యకర్తలతో యువనేత లోకేష్ ముఖాముఖి.
  • 5.56 – పార్టీ కేడర్ కు బాబు సూపర్ సిక్స్ కిట్ల అందజేత.
  • 5.58 – టిడిపి కార్యకర్తలచే యువనేత లోకేష్ ప్రతిజ్ఞ.
  • 5.59 – పార్టీ కేడర్ తో యువనేత లోకేష్ గ్రూప్ సెల్ఫీ.
  • 6.00 – రోడ్డుమార్గం ద్వారా విశాఖపట్టణం ఉత్తర నియోజకవర్గానికి ప్రయాణం.
  • 6.20 – విశాఖపట్టణం ఉత్తర నియోజకవర్గానికి చేరుకుని, అక్కడ బస చేస్తారు.

More Telugu News