Chandrababu: కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

Chandrababu greets former telangana cm kcr
  • కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ చంద్రబాబు ట్వీట్
  • కలకాలం ఆనందం, ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్న టీడీపీ అధినేత
  • కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఏపీ మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. 'జన్మదినం సందర్భంగా నా శుభాకాంక్షలు... కలకాలం ఆనందం, ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను' అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కేసీఆర్ పుట్టిన రోజు కావడంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. పోరాట పటిమతో అంచెలంచెలుగా ఎదిగిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
Chandrababu
KCR
Telangana
Andhra Pradesh

More Telugu News