క్యాన్సర్ కారక రసాయనాలు... పీచు మిఠాయి విక్రయాలను నిషేధించిన తమిళనాడు ప్రభుత్వం
- పీచు మిఠాయి నాణ్యతను పరీక్షించేందుకు చెన్నైలో తనిఖీలు నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ విభాగం
- అధ్యయనంలో రోడమైన్-బి అనే రసాయనాన్ని గుర్తించిన అధికారులు
- కృత్రిమ రంగు కోసం పీచు మిఠాయిలో దీనిని వినియోగిస్తున్నట్లు గుర్తింపు
రోడమైన్-బీని ఇండస్ట్రియల్ డైగా పిలుస్తారు. బట్టల కలరింగ్, పేపర్ ప్రింటింగ్‌లలో దీనిని ఎక్కువగా వినియోగిస్తారు. ఫుడ్ కలర్ కోసం దీనిని ఉపయోగించే అవకాశం లేదు. ఎందుకంటే దీని వల్ల దీర్ఘకాలంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, ఈ రసాయనం శరీరంలోకి వెళితే కిడ్నీ, లివర్ పైన ప్రభావం చూపుతుందని, అల్సర్‌తో పాటు క్యాన్సర్‌కు దారి తీసే ప్రమాదం ఉందని నిపుణులు గుర్తించారు. ఈ క్రమంలో పీచు మిఠాయిలలో దీనిని ఉపయోగిస్తున్నందున వీటి అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించింది.