ఇన్ శాట్-3డీఎస్ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం
- శ్రీహరికోట నుంచి ఇన్ శాట్-3డీఎస్ ప్రయోగం
- ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లిన జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్
- అన్ని దశలు విజయవంతం
- నిర్దేశిత కక్ష్యలోకి చేరిన ఉపగ్రహం
- శాస్త్రవేత్తలను, సిబ్బందిని అభినందించిన ఇస్రో చైర్మన్
ప్రయోగంలో అన్ని దశలు సజావుగా పూర్తి కావడంతో ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ ఓ ప్రకటన చేశారు. ప్రయోగం విజయవంతమైందని తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తలు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. పే లోడ్ లు తయారుచేసిన శాస్త్రవేత్తలకు ప్రత్యేక అభినందనలు అంటూ వెల్లడించారు. ఉపగ్రహం తయారీకి ఎంతో కష్టపడ్డామని సోమనాథ్ తెలిపారు.
భూ, సముద్ర ఉపరితల వాతావరణంపై పరిశీలన కోసం ఈ ఉపగ్రహం సేవలను వినియోగించుకోనున్నారు. ఇన్ శాట్-3డీఎస్ విపత్తులపై ముందే హెచ్చరికలు చేస్తుంది. ఈ ఉపగ్రహం బరువు 2,275 కిలోలు.