Nara Lokesh: అవన్నీ ఈ సినిమాలో ఉన్నాయి: నారా లోకేశ్

  • రాజధాని ఫైల్స్ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూడాలన్న లోకేశ్
  • అమరావతి రైతుల త్యాగాలు అందులో చూపించారని వెల్లడి
  • యాత్ర-2 వైసీపీ వాళ్ల పాలిట అంతిమయాత్రలా మారిందని ఎద్దేవా
Nara Lokesh appeals everyone must watch Rajadhani Files movie

యాత్ర-2 చిత్రం వైసీపీ నాయకులకు అంతిమ యాత్రలా మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం గంట్యాడలో ఈ సాయంత్రం  శంఖారావం సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాజధాని ఫైల్స్ చిత్రం గురించి ప్రస్తావించారు. రాజధాని ఫైల్స్ మీరందరూ చూడాలి అని పిలుపునిచ్చారు. అమరావతి కోసం రైతులు వారి భూములు త్యాగం చేశారని, ఈ అంశాలన్నీ ఆ సినిమాలో ఉన్నాయని లోకేశ్ తెలిపారు.

ఓసారి మందుబాబులు మిమ్మల్ని ఎలా తిడుతున్నారో విందామా!

నాకు స్టార్ క్యాంపెయినర్స్ లేరు... ప్రజలే నా స్టార్ క్యాంపెయినర్స్ అని జగన్ రెడ్డి అంటున్నారు. టైం, డేట్స్ మీరు ఫిక్స్ చేస్తే బూమ్ బూమ్ షాపుల వద్దకు వెళ్లి మందుబాబులు మిమ్మల్ని ఎలా తిడుతున్నారో విందాం. జగన్, సాక్షి పేపర్ ప్రతినిధులు, వైసీపీ నాయకులు సిద్ధమా? 

మద్యం ధరలు పెంచడంతో పాటు నాసిరకం బ్రాండ్లతో పేదల ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నారు. మహిళల తాళిబొట్లు తెంచుతున్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతనే ఓట్లు అడుగుతామన్నారు. ఇప్పుడేం చేశారు. అధికారులకు టార్గెట్లు పెట్టి మరీ మద్యం అమ్మకాలు జరిపిస్తున్నారు. 

వీళ్లందరూ జగన్ కు స్టార్ క్యాంపెయినర్సే!

కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ, పెట్రోల్, డీజిల్ ధరలు, చెత్తపన్ను, నిత్యావసర ధరలు పెంచింది జగన్ ప్రభుత్వం. తెలుగింటి ఆడపడుచులు జగన్ కు కరెంట్ షాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. యువత వద్దకు వెళితే, మీరు చేసిన మోసం తెలుస్తుంది. సాక్షి కేలండర్ తప్ప జాబ్ కేలండర్ లేదు, డీఎస్సీలో మోసం చేశారు. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి చేయలేదు. ప్రతి ఏడాది 6500 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తానని చెప్పి మాట తప్పారు. వీరంతా జగన్ కు స్టార్ క్యాంపెయినర్సే. 

జగన్ కు కలలో కూడా చంద్రబాబు కనిపిస్తున్నారు!

జగన్ కు భయం పట్టుకుంది. రాత్రి కలలో కూడా చంద్రబాబు కనిపిస్తున్నారు. అందుకే ఏ తప్పు చేయని చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారు. 15 ఏళ్లు సీఎంగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా, 8 సార్లు ఎమ్మెల్యేగా చంద్రబాబు పనిచేశారు. నిజాయతీకి మారుపేరు చంద్రబాబునాయుడు. 53 రోజులు అన్యాయంగా జైలుకు పంపారు.  

చంద్రబాబును రాజమండ్రి జైలుకు పంపిస్తే ఆయన చేసిన మంచి పనులు బయటకు వచ్చాయి. జగన్ ని జైలుకు పంపిస్తే రోజుకో అవినీతి బయటపడింది. అదీ చంద్రబాబునాయుడు గారి విశ్వసనీయత. 

చంద్రబాబు అంటే పోలవరం రేంజ్... జగన్ ది పిల్ల కాలువ రేంజ్. చంద్రబాబు అంటే కియా గుర్తుకువస్తుంది. జగన్ అంటే కోడికత్తి గుర్తుకువస్తుంది. బాబు గారు అంటే బ్రాండ్, జగన్ రెడ్డి అంటే చంచల్ గూడ జైలు. చంద్రబాబు విజనరీ. జగన్ ప్రిజనరీ. 

బొత్స అప్పలనర్సయ్య తన ఇంటి పేరు మార్చుకోవాలి!

ఇక్కడ ఎమ్మెల్యే గురించి ఎంత చెప్పిన తక్కువే. బొత్స అప్పల నర్సయ్య. ఆయన ఇంటిపేరు మార్చుకోవాలి. బొత్స కాదు... భూకబ్జాదారుడని మార్చుకోవాలి. ఎక్కడ భూమి దొరికినా కాజేస్తాడు. కుటుంబాల మధ్య చిచ్చుపెట్టి భూములు లాగేస్తున్నారు. ఎక్స్ సర్వీస్ మెన్ భూములు లాక్కుంటున్నారు. 

విచ్చలవిడిగా ఇసుకను దోచేస్తున్నారు. టీడీపీ హయాంలో వెయ్యి రూపాయలకు ఇసుక లభించేది. నేడు రూ.5వేలు అయింది. మిగతా నాలుగు వేలు మీరు తింటున్నారా, బొత్స సత్యనారాయణ తింటున్నారా, జగన్ తింటున్నారా? రెండు నెలల్లో టీడీపీ-జనసేన వస్తుంది. తిన్న ప్రతి రూపాయిని కక్కించి ప్రజలకోసం ఖర్చు చేస్తాం. 

గజపతినగరంలో టీడీపీ-జనసేన బలపరిచిన అభ్యర్తిని గెలిపిస్తే... ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పూర్తిచేస్తాం. బొత్స కుటుంబం తమ స్వార్థం కోసం పోలవరం లెఫ్ట్ కెనాల్ అలైన్ మెంట్ మార్చింది. మేం వస్తే పాత అలైన్ మెంట్  ప్రకారం కాల్వల కాల్వల నిర్మాణం చేపట్టి, గ్రావిటీపై నీళ్లిస్తాం.

నాకు తోబుట్టువులు ఎవరూ లేరు

నాకు అక్కా చెల్లెళ్లు, అన్నా తమ్ములు లేరు. అన్న ఎన్టీఆర్ 60 లక్షల మంది పార్టీ కుటుంబసభ్యులను నాకు ఇచ్చారు. మీ అందరూ కలిసి ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. అందరం కలిసి ముందుకు వెళ్లాలి. మనపై ఇప్పటివరకు అనేక కేసులు పెట్టారు. నాపై 22 కేసులు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు హత్యాయత్నం కేసు పెట్టారు.

చట్టాన్ని ఉల్లంఘించిన అధికారుల పేర్లు ఎర్ర పుస్తకంలో ఉన్నాయి. మేం వచ్చిన తర్వాత విచారించి జ్యుడీషియల్ విచారణ జరిపి జైలుకు పంపిస్తాం. అన్న ఎన్టీఆర్ దేవుడు, చంద్రబాబు రాముడు, వైసీపీ వాళ్ల పాలిట ఈ లోకేశ్ మూర్ఖుడు!

రెడ్ బుక్ ను చూపించి నాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలంటున్నారు. గజపతినగరంలోనే ఉన్నా... వచ్చి అరెస్ట్ చేయండి. ఎవరికీ భయపడేది లేదు. ఎన్టీఆర్,చంద్రబాబు అంత మంచి పేరు తెచ్చుకోకపోయినా నేను ఎవరికీ చెడ్డపేరు మాత్రం తీసుకురాను. 

నారా లోకేశ్ శంఖారావం వివరాలు

ఉమ్మడి విజయనగరం- ఉమ్మడి విశాఖ జిల్లాలు

17-2-2024 (శనివారం) కార్యక్రమ వివరాలు

ఉమ్మడి విజయనగరం జిల్లా
శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గం
ఉదయం
10.15  – విజయనగరం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు కిమిడి నాగార్జున ప్రసంగం.
10.20 – విజయనగరం పార్లమెంట్ జనసేన అధ్యక్షురాలు లోకం నాగ మాధవి ప్రసంగం.
10.25 – మన టీడీపీ యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేశ్ అభినందన.
10.32– శృంగవరపుకోట నియోజకవర్గ జనసేన సమన్వయకర్త వి.సత్యనారాయణ ప్రసంగం.
10.34– శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ కోళ్ల లలిత కుమారి ప్రసంగం.
10.36– శృంగవరపుకోట శంఖారావం సభలో లోకేశ్ ప్రసంగం.
10.56– పార్టీ కేడర్ తో లోకేశ్ ముఖాముఖి.
11.26– పార్టీ కేడర్ కు లోకేశ్ చేతులమీదుగా 'బాబు సూపర్-6' కిట్ల అందజేత.
11.28– పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ చేయించనున్న లోకేశ్.
11.29 – పార్టీకేడర్ తో లోకేశ్ గ్రూప్ సెల్ఫీ.
12.10 – నారా లోకేశ్ పెందుర్తి చేరిక.
12.45 – పెందుర్తి పట్టణంలో భోజన విరామం.

ఉమ్మడి విశాఖపట్నం జిల్లా
పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం
మధ్యాహ్నం
2.15  – అనకాపల్లి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు బుద్ధా నాగ జగదీశ్ ప్రసంగం.
2.25 – మన టీడీపీ యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేశ్ అభినందన.
2.32– పెందుర్తి నియోజకవర్గ జనసేన సమన్వయకర్త పంచకర్ల రమేశ్ ప్రసంగం.
2.34– పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ బండారు సత్యనారాయణ మూర్తి ప్రసంగం.
2.36– పెందుర్తి శంఖారావం సభలో లోకేశ్ ప్రసంగం.
2.56– పార్టీ కేడర్ తో లోకేశ్ ముఖాముఖి.
3.26– పార్టీ కేడర్ కు లోకేశ్ చేతులమీదుగా 'బాబు సూపర్-6' కిట్ల అందజేత.
3.28– పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ చేయించనున్న లోకేశ్.
3.29 – పార్టీకేడర్ తో లోకేశ్ సెల్ఫీ.
4.20 – భీమిలి అసెంబ్లీ నియోజకవర్గానికి నారా లోకేశ్ చేరిక.

భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం
సాయంత్రం
4.45 – విశాఖపట్నం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రసంగం.
4.50 – విశాఖపట్నం అర్బన్ జనసేన అధ్యక్షుడు వంశీకృష్ణ యాదవ్ ప్రసంగం.
4.55 – బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, మన టీడీపీ యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేశ్ అభినందన.
5.02 – భీమిలి నియోజకవర్గ జనసేన సమన్వయకర్త పంచకర్ల సందీప్ ప్రసంగం.
5.04 – భీమిలి నియోజకవర్గ టీడీపీ కోరాడ రాజబాబు ఇన్ చార్జ్ ప్రసంగం.
5.06 – భీమిలి శంఖారావంలో నారా లోకేశ్ ప్రసంగం.
5.26 – పార్టీ కార్యకర్తలతో లోకేశ్ ముఖాముఖి.
5.56 – పార్టీ కేడర్ కు 'బాబు సూపర్-6' కిట్ల అందజేత.
5.58 – టీడీపీ కార్యకర్తలతో లోకేశ్ ప్రతిజ్ఞ.
5.59 – పార్టీ కేడర్ తో లోకేశ్ గ్రూప్ సెల్ఫీ.
6.00 – రోడ్డుమార్గం ద్వారా విశాఖ ప్రయాణం.
6.50 – విశాఖ చేరుకుని, అక్కడ బస చేస్తారు.

More Telugu News