Stock Market: వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 376 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 130 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 4.79 శాతం పెరిగిన విప్రో షేరు విలువ
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ముగించాయి. మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాలను మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో మన మార్కెట్టు కళకళలాడాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 376 పాయింట్లు లాభపడి 72,427కి చేరుకుంది. నిఫ్టీ 130 పాయింట్లు పుంజుకుని 22,041కి పెరిగింది. అమెరికా డాలరుతో పోలిస్తే మన కరెన్సీ మారకం విలువ రూ. 82.04గా ఉంది.  

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
విప్రో (4.79%), మహీంద్రా అండ్ మహీంద్రా (3.96%), ఎల్ అండ్ టీ (2.68%), టాటా మోటార్స్ (2.02%), మారుతి (1.93%). 

టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-2.36%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.90%), రిలయన్స్ (-0.70%), ఎన్టీపీసీ (-0.59%), యాక్సిస్ బ్యాంక్ (-0.31%).

More Telugu News