Viral Videos: పులి చెబుతున్న గుణపాఠం! మనుషులు ఎప్పటికైనా నేర్చుకుంటారా?

  • తటాకంలోని ప్లాస్టిక్ బాటిల్‌ను బైటకు తీసిన పులి
  • ఈ దృశ్యాల్ని నెట్టింట పంచుకున్న  వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ 
  • పులి మనుషులకు ఓ గుణపాఠం చెబుతోందంటూ కామెంట్
  • వీడియోపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన 
  • మానవాళి తన తప్పులను ఎప్పుడు సరిదిద్దుకుంటుందో అంటూ వ్యాఖ్యలు  
Viral video of tiger picking up plastic bottle from waterhole angers internet

ఇందుగలదు అందు లేదు..అన్నట్టు సర్వత్రా వ్యాపించిన ప్లాస్టిక్ వ్యర్థాల సమస్య ప్రస్తుతం సంక్షోభ స్థాయికి చేరుకుంది. మనుషుల తప్పిదానికి జంతువులు కూడా బలవుతున్నాయి. తెలియక ప్లాస్టిక్ వ్యర్థాలను తింటూ మృత్యువాత పడుతున్నాయి. ఈ నేపథ్యంలో నెట్టింట వైరల్‌గా మారిన ఓ వీడియో నెటిజన్లను అమితంగా కదిలిస్తోంది. పులి చెబుతన్న ఈ గుణపాఠాన్ని మనుషులు ఎప్పటికైనా నేర్చుకుంటారా? అన్న నిర్వేదం వ్యక్తమవుతోంది.
 
మహారాష్ట్రలోని తడోబా నేషనల్ పార్క్‌లో ఈ ఘటన జరిగింది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ పులి తనకు సమీపంలోని తటాకంలో పడున్న వ్యర్థ ప్లాస్టిక్ బాటిల్ ను నోట కరుచుకుని బయటకు తీసుకొచ్చింది. దీప్ కాథీకర్ అనే వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఈ అద్భుత దృశ్యాన్ని కెమెరాలో బంధించి నెట్టింట పంచుకున్నారు. పులి గొప్ప పని చేసిందని కితాబునిచ్చారు. ఈ వీడియో వైరల్‌ కావడంతో నెటిజన్లలో ఆగ్రహం, నిరాశ వ్యక్తమయ్యాయి. పులి చెబుతున్న ఈ గుణపాఠం మనుషులు ఎప్పటికైనా నేర్చుకుంటారా? అంటూ కొందరు కామెంట్ చేశారు.

View this post on Instagram

A post shared by Deep Kathikar (@deepkathikar)

More Telugu News