Komatireddy Venkat Reddy: కేసీఆర్, కేటీఆర్ లకు హరీశ్ రావు వెన్నుపోటు పొడిచేలా ఉన్నారు: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Harish Rao may back stab KCR and KTR says Komatireddy Venkat Reddy
  • సీఎం కావాలనే ప్లాన్ లో హరీశ్ ఉన్నారన్న కోమటిరెడ్డి
  • కేటీఆర్, హరీశ్, కవితల పేర్లతో బీఆర్ఎస్ చీలిపోతుందని జోస్యం
  • రాష్ట్రంలో మరో 20 ఏళ్లు కాంగ్రెస్ దే అధికారమని ధీమా
మాజీ మంత్రి హరీశ్ రావును ఉద్దేశించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు చేస్తున్న వ్యాఖ్యలు కేసీఆర్, కేటీఆర్ లకు వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్, హరీశ్ రావు, కవితల పేర్ల మీద విడిపోతుందని అన్నారు. బీఆర్ఎస్ మొత్తం నాలుగు ముక్కలవుతుందని చెప్పారు. సీఎం కావాలనే ప్లాన్ లో హరీశ్ ఉన్నారని అన్నారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో మాట్లడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

బీఆర్ఎస్ లో ఉన్నంత కాలం హరీశ్ రావు కనీసం ఎల్పీ లీడర్ కూడా కాలేరని వెంకటరెడ్డి అన్నారు. 20 మంది ఎమ్మెల్యేలతో ఆ పార్టీ లీడర్ కావాలని ఆయనకు మంత్రి సూచించారు. 60 కిలోల బరువున్న కేసీఆర్ పులి అయితే... 86 కిలోలు ఉన్న తాను ఏం కావాలని అన్నారు. తెలంగాణలో మరో 20 ఏళ్లు కాంగ్రెస్ దే అధికారమని చెప్పారు.
Komatireddy Venkat Reddy
Congress
KCR
KTR
Harish Rao
K Kavitha
BRS
TS Politics

More Telugu News