Group-2: ఏపీపీఎస్సీ గ్రూప్-2 పరీక్షల హాల్ టికెట్ల విడుదల

  • 897 పోస్టులతో గ్రూప్-2 నోటిఫికేషన్
  • ఫిబ్రవరి 25న గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్ట్
  • హాల్ టికెట్లను వెబ్ సైట్లో అందుబాటులో ఉంచిన ఏపీపీఎస్సీ
APPSC released Group 2 hall tickets

ఫిబ్రవరి 25న ఏపీలో గ్రూప్-2 నియామకాల ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష కోసం ఏపీపీఎస్సీ నేడు హాల్ టికెట్లను విడుదల చేసింది. హాల్ టికెట్లను https://psc.ap.gov.in/ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ వెల్లడించింది. 

897 ఉద్యోగాలతో ఏపీ ప్రభుత్వం గ్రూప్-2 నోటిఫికేషన్ ప్రకటించడం తెలిసిందే. నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకారం... ఫిబ్రవరి 25న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రిలిమ్స్ నిర్వహించనున్నారు. ఇందులో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ ప్రశ్నలు ఉంటాయి. ఈసారి గ్రూప్-2 ఉద్యోగాలకు 4 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

More Telugu News