చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేశ్ కు ఏడాది జైలు
- 2019లో జానకీరామయ్య అనే వ్యక్తి వద్ద గణేశ్ రూ.95 లక్షల అప్పు
- చెక్ బౌన్స్ అవడంతో ఒంగోలు కోర్టును ఆశ్రయించిన బాధితుడు
- రూ.95 లక్షలు వెంటనే తిరిగి చెల్లించాలని ఆదేశం
- కోర్టు ఖర్చులు కూడా ఇవ్వాలని ఆర్డర్
ఈ చెక్ బౌన్స్ కావడంతో జానకీరామయ్య తండ్రి ఒంగోలు కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు తాజాగా తీర్పు వెల్లడిస్తూ.. జానకీరామయ్య దగ్గర తీసుకున్న అప్పుతో పాటు కోర్టు ఖర్చులు కూడా వెంటనే తిరిగి చెల్లించాలని ఆదేశించింది. చెక్ బౌన్స్ కావడంతో ఏడాది జైలు శిక్ష విధించింది. గతంలో ఎర్రమంజిల్ కోర్టు కూడా బండ్ల గణేశ్ కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. టెంపర్ సినిమాకు కథ అందించిన వక్కంతం వంశీ దాఖలు చేసిన ఈ కేసులో జైలు శిక్షతో పాటు రూ. 15,86,550 జరిమానా విధించింది.