బాసరలో వసంత పంచమి వేడుకలు ప్రారంభం

Vasant Panchami event in basara nirmal Telangana
తెలంగాణలోని బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకుని 108 కలశాల జలాలతో అభిషేకం నిర్వహించారు. పద్మశాలి సంఘం తరుపున ఆందజేసిన చేనేత పట్టువస్త్రాలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి సేవలో ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పాల్గొన్నారు. ఇక బాసరలో అక్షరాభ్యాసం చేయించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి ఎందరో తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకుని వచ్చారు. తెల్లవారు జామున 3 గంటల నుంచే చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
Go Back to Shorts
Basara
Nirmal District
Telangana

More Telugu News