'కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్తు' పథకాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోదీ
- మరింత స్థిర అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసం ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నామన్న ప్రధాని మోదీ
- కోటి కుటుంబాల్లో వెలుగులు నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించిన మోదీ
- సబ్సిడీలను నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామన్న ప్రధాని మోదీ
మరింత స్థిరమైన అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసం 'పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన' పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. రూ.75వేల కోట్ల పెట్టుబడితో తీసుకువస్తున్న ఈ ప్రాజెక్టుతో ప్రతి నెల రూ.300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించి కోటి కుటుంబాల్లో వెలుగులు నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. దీని కింద అందించే సబ్సిడీలను నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామన్నారు. రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థ ఏర్పాటుకు బ్యాంకుల నుంచి భారీ రాయితీపై రుణాలు పొందవచ్చునని తెలిపారు. ప్రజలపై ఎలాంటి వ్యయ భారం ఉండదన్నారు.