ABVP: తాడేపల్లిలో సీఎం నివాసాన్ని ముట్టడించిన ఏబీవీపీ కార్యకర్తలు... తీవ్ర ఉద్రిక్తత

  • 6,100 పోస్టులతో డీఎస్సీ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
  • మినీ డీఎస్సీ వద్దు మెగా డీఎస్సీ కావాలంటూ ఏబీవీపీ డిమాండ్
  • సీఎం నివాసం వద్దకు ఒక్కసారిగా దూసుకువచ్చిన విద్యార్థి నేతలు
  • అడ్డుకున్న పోలీసులు
ABVP workers protests at CM Jagan residence at Tadepalli

రాష్ట్రంలో మెగా డీఎస్సీ ప్రకటించాలంటూ ఏబీవీపీ కార్యకర్తలు నేడు తాడేపల్లిలో సీఎం జగన్ నివాసాన్ని ముట్టడించారు. మినీ డీఎస్సీ వద్దు మెగా డీఎస్సీ కావాలి అనే నినాదంతో వారు 'ఛలో తాడేపల్లి' పేరిట ఆందోళనకు దిగారు. నిరుద్యోగులను సీఎం జగన్ మోసం చేశారని వారు మండిపడ్డారు. సీఎం నివాసం ముట్టడి సందర్భంగా విద్యార్థి నేతలు ఒక్కసారిగా దూసుకువచ్చారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. వారిని అక్కడ్నించి మంగళగిరి పీఎస్ కు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. 

పలువురు విద్యార్థి నేతలు పోలీసులకు దొరక్కుండా తప్పించుకున్నారు. దొరికిన వాళ్లను ఓ వాహనంలోకి ఎక్కించి అక్కడ్నించి తరలించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ ముట్టడిలో దాదాపు 100 మందికి పైగా విద్యార్థి నేతలు పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పలువురు విద్యార్థి నేతలకు గాయాలైనట్టు సమాచారం.

More Telugu News