తెలంగాణలో 'గృహజ్యోతి' దరఖాస్తుల పరిశీలన.. అర్హులను గుర్తించే పనిలో అధికారులు
- ఇంటింటికీ తిరుగుతూ వివరాలు సేకరిస్తున్న విద్యుత్ శాఖ సిబ్బంది
- 200 యూనిట్ల లోపు వాడుతున్న వారికి ఉచిత విద్యుత్
- ఈ నెల 15 లోగా వివరాల సేకరణ పూర్తి చేయాలని టార్గెట్
ఒకవేళ రేషన్ కార్డు లేకుంటే ఆ కాలమ్ ను వదిలేస్తున్నారు. అద్దెకున్న వారి వివరాలనూ సేకరిస్తున్నారు. జనవరి నెల బిల్లుల సేకరణకు వెళుతున్న సిబ్బంది పనిలో పనిగా గృహజ్యోతి దరఖాస్తుదారుల వివరాలనూ సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియను ఈ నెల 15 లోగా పూర్తి చేసి ప్రభుత్వానికి రిపోర్టు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకం అమలుకు సంబంధించి ఇంకా మార్గదర్శకాలు ఖరారు కాలేదని అధికారులు చెబుతున్నారు.