medigadda: రేపు తెలంగాణ ఎమ్మెల్యేల మేడిగడ్డ పర్యటన... కేసీఆర్ సహా ప్రతి ఎమ్మెల్యేకు లేఖ

  • బస్సుల్లో మేడిగడ్డకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ప్రజాప్రతినిధులు
  • ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్ నుంచి మేడిగడ్డకు బయలుదేరనున్న ప్రజాప్రతినిధులు
  • మధ్యాహ్నం మేడిగడ్డను సందర్శించి... సాయంత్రం 5 గంటలకు తిరుగు ప్రయాణం
MLAs to Visit Kaleswaram Tommorrow

మేడిగడ్డ బ్యారేజీని ఎమ్మెల్యేల బృందం మంగళవారం సందర్శించనుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో కాళేశ్వరంలో భాగమైన ప్రాజెక్టును పరిశీలించనున్నారు. రేపు ఉదయం అసెంబ్లీ నుంచి ప్రత్యేక బస్సులలో కాళేశ్వరం బయలుదేరుతారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ సహా ప్రతి ఎమ్మెల్యేను ఆహ్వానిస్తూ లేఖ రాసినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బస్సుల్లో వెళ్లనున్నారు. 

ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేల మేడిగడ్డ షెడ్యూల్ ఇదే

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ప్రజాప్రతినిధుల మేడిగడ్డ షెడ్యూల్‌ను వరంగల్ సీపీ, జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా ఎస్పీ మీడియాకు విడుదల చేశారు.  

ఉదయం  9.30 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో ప్రజాప్రతినిధులు మేడిగడ్డకు బయలుదేరుతారు.
మధ్యాహ్నం 2 గంటలకు మేడిగడ్డ బ్యారేజీకి చేరుకుంటారు.
మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజీని సందర్శిస్తారు.
మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు ముఖ్యమంత్రి.. అధికారులతో రివ్యూ చేస్తారు.
సాయంత్రం 5 గంటలకు మేడిగడ్డ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు.
రాత్రి 9.30 గంటలకు ప్రజాప్రతినిధులు హైదరాబాద్‌కు చేరుకుంటారు.

More Telugu News