జగన్ మహానటుడు... ఆయనలా ఎవరూ నటించలేరు: నాగబాబు

Jagan is a great actor says Nagababu
  • తల్లిని, చెల్లిని గెంటేసిన స్వార్థపరుడన్న నాగబాబు
  • కల్తీ మద్యం తాగి ప్రజలు చనిపోతే సహజ మరణాలు అన్నారని మండిపాటు
  • జనసేన-టీడీపీదే విజయమని సర్వేలన్నీ చెపుతున్నాయన్న నాగబాబు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై జనసేన నేత నాగబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆస్తి కోసం సొంత తల్లిని, తోడబుట్టిన చెల్లిని గెంటేసిన స్వార్థపరుడని అన్నారు. అధికారం చేతికొచ్చిన తర్వాత తండ్రి ఫొటోను పక్కన పడేశాడని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ప్రజల బతుకులను ఛిద్రం చేసిన వ్యక్తి అని దుయ్యబట్టారు. కల్తీ మద్యం తాగి ప్రజలు చనిపోతే అవి సహజ మరణాలు అని అసెంబ్లీలో చెప్పిన ఘనత జగన్ దని అన్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన - టీడీపీదే విజయమని సర్వేలన్నీ చెపుతున్నాయని తెలిపారు. అనకాపల్లి నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
Nagababu
Janasena
Jagan
YSRCP

More Telugu News