Kona Raghupahti: వైఎస్సార్ కూతురు కాబట్టే షర్మిలను బాపట్ల దాటనిచ్చాం: వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి

Kona Raghupahthi on YS Sharmila
  • బాపట్ల సభలో వైసీపీపై విరుచుకుపడ్డ షర్మిల
  • వైఎస్ పై ఉన్న అభిమానంతో ఆమెను క్షమిస్తున్నామన్న కోన రఘుపతి
  • మరో నేత అయితే బాపట్ల దాటేవారు కాదని వ్యాఖ్య
బుధవారం రాత్రి బాపట్లలో జరిగిన బహిరంగసభలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైసీపీపై, సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. జగన్ ను ప్రజలు ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె అన్నారు. సిద్ధం అంటున్న మీరు దేనికి సిద్ధం అని ప్రశ్నించారు. రూ. 8 లక్షల కోట్లు అప్పు చేయడానికా? పేదలకు 25 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తామని దగా చేయడానికా? మద్య నిషేధం అని మరోసారి మోసం చేయడానికా? అని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిందని ఆమె మండిపడ్డారు. ఇక్కడి ఎమ్మెల్యే, ఎంపీలకు ఇసుకపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదని విమర్శించారు. 

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే  కోన రఘుపతి మాట్లాడుతూ... తనపై, సీఎం జగన్ పై షర్మిల అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురు కాబట్టే ఆమెను బాపట్ల దాటనిచ్చామని చెప్పారు. వైఎస్ పై ఉన్న అభిమానంతో ఆమెను క్షమిస్తున్నామని అన్నారు. షర్మిల కాకుండా మరో నేత ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే బాపట్ల దాటేవారు కాదని చెప్పారు. చంద్రబాబు, పవన్ ఇచ్చే హామీలను ప్రజలు నమ్మరని అన్నారు. ఎంతమంది నాయకులు వచ్చినా  జగన్ ను చేసేదేమీ లేదని చెప్పారు.
Kona Raghupahti
Jagan
YSRCP
YS Sharmila
Congress

More Telugu News