SKN: మెగా-అల్లు కుటుంబాల మధ్య ఎలాంటి గొడవలు లేవు: నిర్మాత ఎస్కేఎన్

Producer SKN talks about Mega and Allu families relation
  • ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూలో ఎస్కేఎన్ ఆసక్తికర వ్యాఖ్యలు
  • మెగా-అల్లు కుటుంబాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని వెల్లడి
  • ఎవరింట్లో ఫంక్షన్ అయినా అందరూ వస్తారని స్పష్టీకరణ

దర్శకుడు మారుతి, నిర్మాత ఎస్కేఎన్ సంయుక్త భాగస్వామ్యంలో తమిళ సినిమా 'లవర్' ను 'ట్రూ లవర్' పేరుతో తెలుగులోకి తీసుకువచ్చారు. ఈ చిత్రం నేడు (ఫిబ్రవరి 10) విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో నిర్మాత ఎస్కేఎన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మెగా-అల్లు కుటుంబాల మధ్య ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేశారు. 

క్రిస్మస్ సందర్భంగా అల్లు అర్జున్, రామ్ చరణ్, ఇతర మెగా, అల్లు హీరోలందరూ, కుటుంబ సభ్యులందరూ వచ్చి వేడుకల్లో పాల్గొన్నారని వెల్లడించారు.  

"మొన్న సంక్రాంతి వచ్చింది... మళ్లీ మెగా-అల్లు కుటుంబాలకు చెందిన అందరూ వచ్చారు. ఒకరు వండుతుంటే, మరొకరు వడ్డిస్తుంటే... ఇలా ఒక కుటుంబం అనేదానికి సరైన నిర్వచనంలా ఉంటారు వాళ్లు. నాకు తెలిసి వాళ్ల మధ్య విభేదాలు ఏవీ ఉండవు. వాళ్లు లోపల ఒకటి ఉంచుకుని, పైకి మరొకటి మాట్లాడే మనుషులు కారు. వాళ్ల వృత్తికి సంబంధించిన వ్యవహారాలతో బిజీగా ఉంటారు తప్ప, ఇతర విషయాల జోలికి వెళ్లరు. 

ఏదైనా సందర్భం వస్తే... ఆ ఫ్యామిలీ వీళ్ల ఇంటికి వస్తుంది... లేకపోతే వీళ్ల ఫ్యామిలీ ఆ ఇంటికి వెళుతుంది. మా మధ్య ఏమీలేదు అని ప్రతిసారీ వాళ్లు స్పందించాల్సిన అవసరం లేదు" అని ఎస్కేఎన్ వివరించారు.

  • Loading...

More Telugu News