Tirupati LS Bypolls: తిరుపతి దొంగ ఓట్ల వ్యవహారంలో మరో అధికారిపై సస్పెన్షన్ వేటు

  • 2021లో తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికలు
  • బయటి వ్యక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఓట్లేశారంటూ విపక్షాల ఫిర్యాదులు 
  • ఈ ఘటనలో ఇప్పటికే అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషా సస్పెన్షన్ 
  • తాజాగా మెప్మా అసిస్టెంట్ డైరెక్టర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డిపై వేటు
Another official suspended in Tirupati fake votes incident

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల సందర్భంగా దొంగ ఓట్ల వ్యవహారం కుదిపేసిన సంగతి తెలిసిందే. బయటి వ్యక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి తిరుపతిలో ఓటేశారంటూ విపక్షాలు ఆరోపించాయి.

ఈ వ్యవహారంలో ఇప్పటికే అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాను సస్పెండ్ చేశారు. తాజాగా మరో అధికారిపై వేటు పడింది. విజయవాడ మెప్మా అసిస్టెంట్ డైరెక్టర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి నేడు సస్పెండ్ అయ్యారు. 

2021లో తిరుపతి ఉప ఎన్నికలు జరిగిన సమయంలో చంద్రమౌళీశ్వర్ రెడ్డి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్నారు. ఆ తర్వాత ఆయన విజయవాడ మెప్మా అసిస్టెంట్ డైరెక్టర్ గా బదిలీ అయ్యారు. చంద్రమౌళీశ్వర్ రెడ్డి ఆర్ఓ లాగిన్ తో 35 వేల ఓటరు కార్డులు డౌన్ లోడ్ చేశారని గుర్తించారు. ఈ నేపథ్యంలో, ఎన్నికల సంఘం ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది.

More Telugu News