పీవీ నరసింహారావుకు భారతరత్న.. చరణ్ సింగ్, స్వామినాథన్ లకు కూడా!
- ఈ ఏడాది ఐదుగురికి భారతరత్న పురస్కారాలు
- ఇప్పటికే కర్పూరీ ఠాకూర్, ఎల్ కే అద్వానీలకు భారతరత్న ప్రకటన
- ఎక్స్ వేదికగా ప్రకటించిన ప్రధాని మోదీ
1921 జూన్ 28న వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో పీవీ జన్మించారు. 1991 జూన్ 21 నుంచి 1996 మే 16 వరకు భారత ప్రధానిగా ఆయన సేవలందించారు. 1971 సెప్టెంబర్ 30 నుంచి 1973 జనవరి 10 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 4వ ముఖ్యమంత్రిగా బాధ్యతలను నిర్వర్తించారు. కేంద్ర హోం మంత్రి, భారత విదేశాంగ మంత్రి, భారత రక్షణ మంత్రిగా ఆయన దేశానికి ఎనలేని సేవ చేశారు. ప్రధానిగా పీవీ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశ ఆర్థిక స్వరూపాన్ని సమూలంగా మార్చేశాయి. ఈరోజు భారత్ బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతుండటం వెనుక ఆయన ఆరోజు వేసిన పునాదులే కారణం.