YS Jagan: ఢిల్లీ పర్యటనకు బయల్దేరిన ఏపీ సీఎం జగన్

AP CM Jagan off to Delhi
  • గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం జగన్ హస్తిన పయనం
  • ఈ రాత్రికి జన్ పథ్ నివాసంలో బస
  • రేపు ప్రధాని మోదీతో సమావేశం
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. ఈ సాయంత్రం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో హస్తినకు పయనమయ్యారు. ఈ రాత్రికి ఆయన దేశ రాజధానిలోని నెం.1 జన్ పథ్ నివాసంలో బస చేయనున్నారు. సీఎం జగన్ రేపు (ఫిబ్రవరి 9) ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. 

కాగా, ప్రధాని మోదీతో సమావేశంలో పోలవరం నిధుల విడుదల, కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన పన్ను వాటా చెల్లింపులు, ప్రత్యేక హోదా, విభజన హామీలు, కేంద్ర జలశక్తి శాఖ వద్ద పెండింగ్ అంశాల క్లియరెన్స్, మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్రం నుంచి మరింత వాటా, విశాఖ స్టీల్ ప్లాంట్... తదితర అంశాలపై సీఎం జగన్ చర్చించే అవకాశం ఉంది.
YS Jagan
New Delhi
Narendra Modi
YSRCP
Andhra Pradesh

More Telugu News