యాత్ర-2లో సన్నివేశాలు నా గుండెను పిండేశాయి: అంబటి రాంబాబు
- వైఎస్సార్, జగన్ రాజకీయ జీవితంలోని ఘట్టాల ఆధారంగా యాత్ర-2
- మహి వి రాఘవ్ దర్శకత్వంలో చిత్రం
- నేడు విడుదల
- ఎక్స్ లో స్పందించిన మంత్రి అంబటి
ఈ సినిమాను వైసీపీ ప్రజాప్రతినిధులు కూడా వీక్షించినట్టు తెలుస్తోంది. మంత్రి అంబటి రాంబాబు కూడా యాత్ర-2 సినిమాను చూసిన అనంతరం తన స్పందనను సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. మహి దర్శకత్వంలో వచ్చిన యాత్ర-2 చిత్రంలోని ఎమోషనల్ సన్నివేశాలు నా గుండెను పిండేశాయి అంటూ అంబటి ట్వీట్ చేశారు.