Team India: జింబాబ్వేలో టీమిండియా పర్యటన షెడ్యూల్ విడుదల

  • జూన్ లో ఐసీసీ టీ20 వరల్డ్ కప్
  • వరల్డ్ కప్ ముగిశాక జింబాబ్వే పర్యటనకు వెళ్లనున్న టీమిండియా
  • ఇరు జట్ల మధ్య 5 టీ20 మ్యాచ్ లు
  • అన్ని మ్యాచ్ లు హరారేలో జరుగుతాయన్న బీసీసీఐ
Team India tour of Zimbabwe schedule released

జూన్ లో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొన్న అనంతరం టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. జూన్ 1 నుంచి 29 వరకు అమెరికా, వెస్టిండీస్ దేశాల్లో టీ20 వరల్డ్ కప్-2024 జరగనుంది. ఈ టోర్నీ అనంతరం జింబాబ్వేలో టీమిండియా పర్యటన ప్రారంభం అవుతుంది. జులై 6 నుంచి 14వ తేదీ వరకు టీమిండియా-జింబాబ్వే జట్ల మధ్య 5 టీ20 మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ  మ్యాచ్ లన్నీ హరారేలో నిర్వహించనున్నారు. జులై 6, 7, 10, 13, 14 తేదీల్లో మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ మేరకు నేడు బీసీసీఐ షెడ్యూల్ విడుదల చేసింది.

More Telugu News