Operation Valentine: 'ఆపరేషన్ వాలెంటైన్' నుంచి సాంగ్ రిలీజ్!

  • వరుణ్ తేజ్ తాజా చిత్రంగా 'ఆపరేషన్ వాలెంటైన్'
  • ఆయన సరసన సందడి చేయనున్న మానుషి చిల్లర్
  • సంగీతాన్ని అందించిన మిక్కీ జె. మేయర్ 
  • మార్చి 1వ తేదీన సినిమా విడుదల

Operation Valentine Song Released

వరుణ్ తేజ్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఆపరేషన్ వాలెంటైన్' సిద్ధమవుతోంది. సోని పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి, శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించాడు. వరుణ్ జోడీగా మానుషి చిల్లర్ అలరించనుంది. మార్చి 1వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. 

కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేశారు. 'గగనాల తేలేను నీ ప్రేమలోన .. ఎగిరాను ఎన్నేసి జన్మాలైనా .. తెగిపోయే బంధాలు లోకాలతోనా .. నువ్వేదురైన ఆనాటి తొలి చూపులోనా' అంటూ ఈ పాట సాగుతోంది. హీరో .. హీరోయిన్ పై ఈ పాటను చిత్రీకరించారు. 

మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా, అర్మాన్ మాలిక్ ఆలపించాడు. ఈ సినిమాలో వరుణ్ వాయుసేన అధికారిగా కనిపించనున్నాడు. నవదీప్ .. మహ్మద్ మీరు సర్వర్ ఇతర ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. తెలుగుతో పాటు ఈ సినిమాను హిందీలోను విడుదల చేస్తుండటం విశేషం.

More Telugu News