ఓటీటీలోకి అడుగుపెడుతున్న సంచలనం .. 'కాటేరా'
- కన్నడలో హిట్ కొట్టిన 'కాటేరా'
- 200 కోట్లకి పైగా రాబట్టిన వసూళ్లు
- హీరోయిన్ గా ఆరాధన రామ్ ఎంట్రీ
- ఈ నెల 9వ తేదీ నుంచి జీ 5లో స్ట్రీమింగ్
అలాంటి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను జీ 5వారు సొంతం చేసుకున్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. కన్నడతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ గా జగపతిబాబు నటించడం విశేషం.
ఈ సినిమా కథ 1970లలో నడుస్తూ ఉంటుంది. కథాకథనాలు .. దర్శన్ పాత్రలోని వేరియేషన్స్ .. ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. మాలాశ్రీ కూతురు 'ఆరాధన రామ్' ఈ సినిమాతోనే కన్నడ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది. ఇక మరో ముఖ్యమైన పాత్రలో వినోద్ కుమార్ నటించాడు. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఎన్ని మార్కులు తెచ్చుకుంటుందనేది చూడాలి.