Poacher: అమెజాన్ ప్రైమ్ కి ఇంట్రెస్టింగ్ క్రైమ్ సిరీస్ .. 'పోచర్'

  • రిచీ మెహతా నుంచి వచ్చిన 'ఢిల్లీ క్రైమ్'
  • నెక్స్ట్ సిరీస్ గా రూపొందిన 'పోచర్'
  • ఫారెస్టు నేపథ్యంలో సాగే కథ 
  • ఈ నెల 23 నుంచి స్ట్రీమింగ్ 
Poacher Web Series

అమెజాన్ ప్రైమ్ ఫ్లాట్ ఫామ్ పైకి రావడానికి 'పోచర్' సిరీస్ రెడీ అవుతోంది. ఎమీ అవార్డు విజేత రిచీ మెహతా ఈ సిరీస్ ను రూపొందించారు. మలయాళంలో 8 ఎపిసోడ్స్ గా ఈ సిరీస్ ను నిర్మించారు. నిమిషా సజయన్ .. రోషన్ మాథ్యూ .. దివ్యేంద్ర భట్టాచార్య ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వారు దక్కించుకున్నారు.

ఈ సిరీస్ ను ఈ నెల 23వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ ను రూపొందించారు. అడవులను అడ్డాగా చేసుకుని కొంతమంది తమ అక్రమ వ్యాపారాలను కొనసాగిస్తూనే ఉన్నారు. అలా వాళ్లు చేసే వ్యాపారాలలో ఒకటి .. ఏనుగు దంతాల రవాణా. ఆ దంతాల కోసం ఏనుగులను హతమారుస్తున్నారు.  

అడవులే కేంద్రంగా జరుగుతున్న ఈ అక్రమవ్యాపారంపై జరిగే ఇన్వెస్టిగేషన్ ఈ సిరీస్. క్యూసీ సంస్థవారు నిర్మించిన ఈ సిరీస్, ఢిల్లీ .. కేరళ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంది. 'ఢిల్లీ క్రైమ్' సిరీస్ తో ఆకట్టుకున్న రిచీ మెహతా నుంచి వస్తున్న సిరీస్ కావడంతో అంతా కూడా ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ సిరీస్ ఎన్ని మార్కులు కొట్టేస్తుందనేది చూడాలి.

More Telugu News